మా బాబు కథాంశం:
డాక్టర్ ఆనంద్ భార్య ఓ పిల్లవాణ్ణి ప్రసవించి వెంటనే మరణిస్తుంది. అదే సమయంలో ఆనంద్ ఆస్పత్రిలోనే రత్నాదేవి అనే వితంతువు ఓ మగశిశువును కని స్పృహతప్పిపోతుంది. ఆమె శిశువు చనిపోతాడు. అంతకు ముందే ఆ శిశువును కాపాడతానని ఆమెకు వాగ్ధానం చేస్తాడు ఆనంద్. ఆ వాగ్ధానం వమ్మయ్యిందనే ఆవేదన, తన కొడుకును సాకేవాళ్లెవరనే నిస్పృహతో, క్షణికోద్వేగానికి గురై తన బిడ్డనే ఆమె బిడ్డగా రత్నాదేవికి అప్పగిస్తాడు. రత్నాదేవి కానీ, ఆమె బంధువులకు కానీ పిల్లవాడు మారిపోయాడనే విషయం తెలీదు. ఒక్క నర్సుకు మాత్రమే ఈ రహస్యం తెలుసు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఆమె వద్ద మాట తీసుకుంటాడు ఆనంద్. తన కొడుకుపై ఉన్న ప్రేమకొద్దీ తరచూ రత్నాదేవి ఇంటికి వెళ్తుంటాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల మాయ అనే నర్సును అతను పెళ్లాడాల్సి వస్తుంది. ఆమె ఎవరో కాదు, మొదటి నర్సు కూతురే. ఆనంద్ తండ్రి మరణిస్తూ, నెలకు రూ. 10 వేల వరకూ ఆదాయం వచ్చే తన ఆస్తి తన మనవడికి చెందుతుందని వీలునామా రాస్తాడు. వైద్య శాస్త్ర రీత్యా మాయకు సంతాన యోగ్యం ఉండదు. దాంతో రత్నాదేవి వద్ద పెరుగుతున్న అబ్బాయి ఆనంద్ కొడుకేననీ, అతణ్ణి తెచ్చుకుంటే ఆస్తి దక్కుతుందనీ మాయకు ఉపాయం చెబుతుంది తల్లి. దాంతో మాయ కోర్టుకెక్కుతుంది. ఆ బాబు డాక్టర్ ఆనంద్ కొడుకేనని కోర్టు నిర్ధారిస్తుంది. బాబు దూరమవడంతో రత్నాదేవి కుప్పలా కూలిపోతుంది. బలవంతాన తన దగ్గరకు తెచ్చుకున్న బాబును మాయ మాలిమి చేసుకోలేకపోతుంది. బాబు ఇంటి నుంచి పారిపోతాడు. వాడిని వెంటాడుతూ మాయ వెళ్తుంది. ఆనంద్, రత్నాదేవి కూడా వెళ్తారు. మాయ ఓ ప్రమాదంలో చిక్కుకొని మరణిస్తుంది. అలా రెండో భార్యను కూడా పోగొట్టుకున్న ఆనంద్ చివరకు బాబును రత్నాదేవికిచ్చేసి తన జీవితాన్ని వైద్యవృత్తికే అంకితం చేస్తాడు.తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, రేలంగి, ఎం. సరోజ, ఎం.ఎన్. రాజం, కన్నాంబ, హనీ ఇరానీ
సంగీతం: టి. చలపతిరావు
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
విడుదల తేదీ: 22 డిసెంబర్ 1960
No comments:
Post a Comment