1. Sri Krishna Thulabharam (1935)
2. Veera Abhimanyu (1936)
3. Vipra Narayana (1937) (Devadevi)
4. Mala Pilla (1938) (Shampalatha)
5. Grihalakshmi (1938) (Madhuri)
6. Vande Matharam (1939) (Janaki)
7. Malli Pelli (1939) (Lalitha)
8. Mairavana (1940) (Chandrasena)
9. Illalu (1940)
contd...
Sunday, December 13, 2015
Poetry: Rain Coming
వాన వచ్చె
గగన చుంబిత ప్రాసాదాగ్రములపై తరుణ అరుణుడు
కావికాంతుల దరహాస నయనముల విచ్చుచుండె
తెల్లవారెనో లేదోయనే సంకోచముతో
కోయిలలు తీయని కూతలు కూయసాగె
భిక్షకుని వాణి సుఖనిద్రారతములగు
నగర హర్మ్యముల మారుమోగుచుండె
గతరాత్రి మైమరపించిన మనోహరిణి
పుష్పమాలికలు వసివాడి జారి నలిగిపోవుచుండె
మేఘములు ఆత్మత్యాగ మొనర్చుకొని
వర్షధారల నొసగుచుండె
Saturday, December 12, 2015
Synopsis of the movie VINDHYA RANI (1948)
'వింధ్యరాణి' (1948) చిత్ర కథాంశం
వింధ్యరాజు ఒక ప్రత్యేక ఉన్మత్త మనస్తత్వం కలిగినవాడు. స్వప్రయోజనం కోసం నీతినియమాల్ని పాటించడు. నీతిబోధలన్నా, మంచిమాటలన్నా అతనికి విసుగు. వందిమాగధుల ప్రశంసలకు ఉబ్బిపోడు. స్తోత్రాలలోని వాస్తవమెంతో తెలిసినవాడు. అలా అని ఎదుటివాళ్ల ప్రశంసల్ని ఆశించని అమాయకుడు కాడు. స్త్రీద్వేషి కాకపోయినా వాళ్లంటే గౌరవం లేనివాడు. కామంతో రగిలిపోయే భోగలాలసుడు. అయితే బలహీనులైన స్త్రీలంటే అతనికి రోత. తనకు తగ్గ దృఢవంతురాలై, తన అధికార పరాక్రమానికి ఎదురునిల్చి, బుసలుకొట్టే మహాక్రోధ అయిన స్త్రీని చేజిక్కించుకొని, చెరబట్టి, లొంగదీసుకోవడంలోనే అతనికి మహానందం.
అలాంటి స్త్రీ ఒకామె అతనికి తారసిల్లింది. ఆమే వింధ్యరాణి. ఆమెను ఉడికించి, రెచ్చగొట్టి, ఆమెలో ఎంత విషమున్నదో దాన్నంతా కక్కించేదాకా అతనికి నిద్రపట్టదు. నిద్రపోతున్న తనను ఆమె చాకుతో పొడిచినా కూడా, ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటాడే తప్ప ద్వేషించడు. నీతిమంతంగా ఉండేవాళ్లను అతను సహించడు. అలాంటి వాళ్లు అతని దృష్టిలో పిరికిపందలు. వాళ్లను రెచ్చగొట్టి, వాళ్లలోని ఉద్రేకాలని బయటకుతీసి, అంతలోనే వాళ్ల నెత్తిపై చరిచి, తిరిగి వాళ్లను యథాస్థానంలోకి కుచించుకుపోయేట్లు చేయడం అతనికి సరదా.
శివశ్రీని అలాగే ఉడికించాడు. కానీ శివశ్రీ ధర్మమార్గ పరాయణుడు, అహింసామార్గానువర్తి. వింధ్యరాజు అసహాయంగా చేత చిక్కినప్పుడు, అతడు తన శత్రువైనప్పటికీ హింసించకుండా క్షమించి విడిచిపెట్టి, పరితాపాగ్నిలో ముంచేశాడు. ఆ పరితాపాగ్ని అతని స్వభావంలోని చెడుని దహించివేసి, సహజంగా అతనిలో ఉన్న మంచిని ప్రేరేపించి, ఇతరుల మంచినికోరే యోగిగా అతణ్ణి మార్చేస్తుంది.
తారాగణం: పుష్పవల్లి, డీవీ సుబ్బారావు, రమణారావు, వరలక్ష్మి, రేలంగి, పండితరావు, ఏవీ సుబ్బారావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: వైజయంతి ఫిలిమ్స్
విడుదల తేదీ: 14 జనవరి
Friday, December 11, 2015
Actor P. Suribabu Filmography
1. Draupadi Vastrapaharanam (1936) (Narada)
2. Kanaka Thara (1937) (Sadhu)
3. Mala Pilla (1938) (Chowdarayya)
4. Radha Krishna (1939) (Gopala)
5. Raitu Bidda (1939) (Ramajogi)
6. Illalu (1940)
7. Tara Sasankam (1941)
contd...
2. Kanaka Thara (1937) (Sadhu)
3. Mala Pilla (1938) (Chowdarayya)
4. Radha Krishna (1939) (Gopala)
5. Raitu Bidda (1939) (Ramajogi)
6. Illalu (1940)
7. Tara Sasankam (1941)
contd...
Thursday, December 10, 2015
Synopsis of the movie KALASINA MANASULU (1968)
'కలసిన మనసులు' (1968) చిత్ర కథాంశం
రామాపురం గ్రామంలో మోతుబరి వెంకటరత్నం (రేలంగి). కొడుకు శేఖర్ (జగ్గయ్య), మనవరాలు లక్ష్మి (బేబీ శంతికళ) తప్ప ఆ ఇంట్లో మరో ప్రాణి లేదు. లక్ష్మి బాగోగులు చూసేందుకు ఆయాగా నిర్మల (వాణిశ్రీ) వస్తుంది. నిర్మల అన్నయ్య రాము (శోభన్‌బాబు) పట్నంలో వెంకటరత్నం దయాధర్మాలతో చదువుతుంటాడు. ఆ ఊళ్లోనే ఉండే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోరికల కొండలరావు (అల్లు రామలింగయ్య) ఏకైక పుత్రిక లీల (భారతి) పంతులమ్మగా పనిచేస్తుంటుంది. రాము, లీల చిన్ననాటి చెలిమితో పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు. కోరికల కొండలరావుకు కోరికలు జాస్తి. తనకు కాబోయే అల్లుడు అర్హతలంటూ బ్లాక్‌బోర్డుపై ఓ దండకం రాసి వాటిని కూతురి చేత నిత్య పారాయణం చేయిస్తూ ఉంటాడు.
పట్నంలో బీకాం పరీక్ష రాసిన రాము ఇంటికి వస్తూ దారిలో మూర్తీ అండ్ కంపెనీ మేనేజర్ ఆనంద్ (రామ్మోహన్)ను దొంగల బారి నుండి కాపాడటమే కాక ఆస్పత్రిలో తన రక్తం ఇచ్చి ప్రాణదానం చేస్తాడు. రాము నిజాయితీకి, త్యాగనిరతికి ఆకర్షితుడైన ఆ కంపెనీ యజమాని రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు.
రాము ఆహ్వానంపై అతని ఇంటికి వచ్చిన ఆనంద్, అక్కడ లీలను చూసి, ఆమెను రాము చెల్లెలు నిర్మలగా భ్రమించి ప్రేమిస్తాడు. ప్రేమ పర్యవసానం - ఆనంద్, నిర్మల వివాహం. తీరా తాళికట్టబోయే సమయంలో నిర్మలను చూసిన ఆనంద్ 'ఇదంతా మోసం' అంటూ పెళ్లిపీటల మీదనుంచి లేచిపోతాడు. ఆ అవమానం కలిగించిన దుఃఖంతో నిర్మల తల్లి మరణిస్తుంది. పచ్చని కల్యాణమంటపం శోకానికి నిలయం కాగా, నిర్మలకు పెళ్లి చేశాకే తను వివాహం చేసుకుంటానని చివరి క్షణాల్లో తల్లికి మాటిస్తాడు రాము.
ఎందుకిలా చేశావని ఆనంద్‌ను నిలదీస్తాడు రాము. పేరు ఏదైనా తను చూసిందీ, ప్రేమించిందీ లీలననీ, ఆమె కూడా తనను ప్రేమించిందనీ, దానికి నిదర్శనం కూడా ఉందనీ దబాయిస్తాడు ఆనంద్. దీంతో నిర్ఘాంతపోయిన రాము భగ్న ప్రేమికుడిలా బాధను అనుభవిస్తుంటాడు. లీలను ఆనంద్ ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న అతని తల్లి కోర్కెల కొండలరావుతో మాట్లాడి లీల, ఆనంద్ పెళ్లి నిశ్చయం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న లీల తన హృదయంలో రాముకు తప్ప మరొకరికి చోటులేదని ఆనంద్‌కు తేల్చిచెప్పి, ఆనంద్ తన ప్రేమకానుకను ఇచ్చింది నిర్మలకేనని రుజువుచేస్తుంది. దాంతో కథ సుఖాంతం.
తారాగణం: శోభన్‌బాబు, భారతి, వాణిశ్రీ, జగ్గయ్య, రామ్మోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, హేమలత, రావి కొండలరావు, గుంటూరు వెంకటేశ్, బేబీ శాంతికళ
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: ఎమ్మెస్ రెడ్డి
దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు
బేనర్: కౌముది పిక్చర్స్
విడుదల తేదీ: 11 అక్టోబర్
Wednesday, December 9, 2015
Actor Parupalli Subba Rao Filmography
1. Lava Kusa (1934)
2. Sri Krishna Leelalu (1935)
3. Draupadi Mana Samrakshanam (1936) (Dharmaraju)
4. Mahananda (1939)
5. Bhoja Kalidasa (1940)
6. Tenali Ramakrishna (1941)
7. Parvathi Kalyanam (1941)
2. Sri Krishna Leelalu (1935)
3. Draupadi Mana Samrakshanam (1936) (Dharmaraju)
4. Mahananda (1939)
5. Bhoja Kalidasa (1940)
6. Tenali Ramakrishna (1941)
7. Parvathi Kalyanam (1941)
Tuesday, December 8, 2015
Synopsis of the movie BOMMALU CHEPPINA KATHA (1969)
'బొమ్మలు చెప్పిన కథ' (1969) చిత్ర కథాంశం
అమరావతీ నగర మహారాజు (ధూళిపాళ) బావమరిది వీరసేనుడి (ప్రభాకరరెడ్డి) ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరొకరి మరణానికి కారకులవుతారని బొమ్మలు చెపుతాయి. ఇది విన్న వీరసేనుడు చిన్న కూతుర్ని కాళీ ఆలయంలో వదిలేసి వెళ్తాడు. ఆ అమ్మాయి చంప (విజయనిర్మల) పేరుతో ఓ గొర్రెల కాపరి వద్ద పెరుగుతుంది. పెద్దమ్మాయి సుజాత (విజయలలిత) రాజ ప్రసాదంలో పెరిగి యువరాజు ప్రతాప్ (కాంతారావు)పై మనసు పడుతుంది.
రాజ్యంలో బందిపోట్ల అరాచకాల్ని అణచాలని అడవికి వెళ్లిన ప్రతాప్ బందిపోట్ల చేతుల్లో దెబ్బలుతిని అక్కడ చంప ఆశ్రయంలో తేరుకొంటాడు. ఆమెను ప్రేమించి పెళ్లాడి అంతఃపురానికి తెస్తాడు. తను ప్రేమించినవాణ్ణి వలలో వేసుకొని పెళ్లి చేసుకుందనే కక్షతో చంపను ఏడిపిస్తూ ఉంటుంది సుజాత. విషమిచ్చి చంపటానికి సైతం ప్రయత్నిస్తుంది. అది విఫలం కావడంతో పగతో రగిలిపోతూ ఉంటుంది. ఈలోగా బందిపోటు మంగు (కృష్ణ) అనుచరుణ్ణి యువరాజు పట్టుకొని ఉరితీయించాడనే వార్త బందిపోటు దొంగల్లో కలవరం కలిగిస్తుంది. ప్రతాప్‌ను చంపడానికి అర్ధరాత్రి అంతఃపురానికి వెళ్లిన మంగూను తన అన్నగా గుర్తిస్తుంది చంప.
ఇంతలో యువరాజు మేల్కొని వెన్నంటి తరమగా గాయపడిన మంగు కాళికాలయం చేరి, అక్కడ బొమ్మలు చెప్పిన మరో కథ వింటాడు. చంప శ్రీమంతం నాటి రాత్రి ఒక కాలనాగు యువరాజును కాటువేస్తుంది. ఈలోగా చంప తన భర్త గుండెల్లో గాయంచేసి ఆ రక్తంతో నుదుట తిలకం దిద్దుకుంటే యువరాజు బతుకుతాడు. ఈ రహస్యం ఆమె బయటపెడితే భర్త శిలగా మారిపోతాడు. ఈ కథ వినడంతో యువరాజు రక్షణకు సిద్ధమవుతాడు మంగు. అదును కోసం వేచిచూస్తున్న సుజాత, ఇదే సమయమని మంగూ చంపలకు రంకు అంటగట్టి యువరాజును హత్యచేయడానికి ప్రయత్నించిందని చంపపై అభియోగం మోపుతుంది. విచారణలో చంపకు నిజం చెప్పక తప్పలేదు. ఫలితంగా యువరాజు శిలైపోతాడు. చంపను మాయలమారిగా నిర్ణయించి శిక్ష విధిస్తారు. అప్పుడే రాజును బంధించి సింహాసం ఆక్రమిస్తాడు మంత్రి.
ఈ చిక్కును విడదీసే ఉపాయాన్ని సైతం బొమ్మలే చెబుతాయి. మంగు సాహసంతో, సుజాత ఆత్మ పరిత్యాగంతో కథ నిర్ణీత ప్రకారం సుఖాంతమవుతుంది. మంగు ఎవరో కాదు, వీరసేనుడి కుమారుడేనని తేలుతుంది.
తారాగణం: కాంతారావు, కృష్ణ, విజయనిర్మల, విజయలలిత, సంధ్యారాణి, గీతాంజలి, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, మిక్కిలినేని, రాజబాబు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాత: డి. రామానాయుడు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: సురేశ్ మూవీస్
విడుదల తేదీ: 4 ఏప్రిల్
Saturday, December 5, 2015
Can STAR save the movie?
'సినిమా' చూపిస్తున్నారు!
జీవనం కోసం పగలంతా కష్టపడి అలసినవాళ్లకు కొద్దిసేపైనా విశ్రాంతీ, వినోదం అవసరం. అందువల్లే వినోదాన్నిచ్చే సినిమాలు, టీవీ జన జీవనంలో ప్రాధాన్యం ఏర్పరచుకున్నాయి. నిజానికి ఇవాళ సినిమాకు పరమావధి వినోదమే. నిత్య జీవితంలో మనం పడ్డ శ్రమనూ, కష్టాన్నీ మరిపించి సినిమాలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. అందుకని మంచికో, చెడుకో ఈ సినీ పరిశ్రమ ఏర్పడిన నాటినుంచీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఇవాళున్న స్థాయికి చేరింది. హాలీవుడ్‌లో తయారయ్యే సినిమాల్లో ఎక్కువ అశ్లీలత, హింస కనిపిస్తాయి. యువత మనసుల్లో అవి విష ఫలితాల్ని కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో సామాజిక సంస్థలు, మహిళా సంఘాలూ కొన్నేళ్ల క్రితం వాటిని మన ప్రాంతంలో నిషేధించాలని ఆందోళనలు కూడా చేశాయి. కానీ ఇవాళ ఇంటర్నెట్ కారణంగా మితిమీరిన అశ్లీలత అందుబాటులోకి రావడంతో సినిమాల్లోని అసభ్యత, అశ్లీలత, హింస గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేటి మన సినిమాల్ని గమనిస్తే హాస్యం పేరుతో ఎంత అసభ్యత చలామణీ అవుతుందో అర్థమవుతుంది. అశ్లీలంగా, అభ్యంతరకరంగా తోచిన సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ఏర్పాటుచేసిన సెన్సార్ బోర్డులు ఆ పనిని చేయకుండా 'చూసీచూడనట్లు' పోతుండటంతో అలాంటి సన్నివేశాలు మన సినిమాల్లో సాధారణ విషయం కింద తయారయ్యాయి.
హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాల్లోని సెక్స్ సన్నివేశాల్నీ, అర్ధనగ్నత్వాల్నీ మనవాళ్లు గుడ్డిగా.. కాదు కాదు.. యథేచ్ఛగా అనుకరిస్తున్నారు. ఇవి మనదేశ పునర్నిర్మాణానికి గానీ, సంస్కృతీ వికాసానికి గానీ ఏమాత్రం తోడ్పడవు. కొన్నేళ్లుగా తెలుగులో కానీ, హిందీలో కానీ తయారవుతున్న చిత్రాల్లో చాలావరకు విదేశీ సినిమాల అనుకరణే అని చెప్పాలి. అందుకే వాటిలో నేటివిటీ అనేది కనిపించడం లేదు. కథా విశిష్టత మచ్చుకైనా కానరావడం లేదు. ఈ విషయంలో మన పొరుగున ఉన్న తమిళ సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. వాళ్లు నేటివిటీతో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అక్కణ్ణించి తెలుగులో అనువాదమై వస్తున్న సినిమాలు చెబుతున్నాయి.
తెలుగు సినిమా ప్రారంభ సంవత్సరాల్లోనే గూడవల్లి రామబ్రహ్మం వంటి దర్శకుల నుంచే చక్కని చిత్రాలు, ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే సినిమాలు తీయడం మొదలైంది. అవి ప్రేక్షకుల్లో చక్కని ఆలోచనలను రేకెత్తించేవి. వాళ్ల అభిరుచి మెరుగుపడేందుకు దోహదం చేసేవి. సామాజిక దురన్యాయాల్ని అరికట్టాలనే ఆవేశాన్ని రగిలించేవి. భూస్వాముల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, వరకట్న నిర్మూలనం, ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, అవినీతి అధికార్ల దాష్టీకాల్ని ప్రశ్నించడం, కింది కులాలవారిపై అగ్రవర్ణాల పీడనను నిలదీయడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, ఊరిని బాగుచేసుకోవడం.. ఇలా ఎన్నెన్నో అంశాలతో సినిమాలు వచ్చాయి. ఇవి ఓ వైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు మానసిక వికాసాన్నీ కలిగించేవి.
కొంతకాలం చిత్ర పరిశ్రమ అభివృద్ధి మార్గంలోనే ఉంది కానీ, దురదృష్టవశాత్తూ జానపద, పౌరాణిక సినిమాల ధాటికి సామాజిక చిత్రాలు వెనకపడిపోయాయి. ఫలితంగా పరిశ్రమ ఆత్మే నాశనమయ్యే స్థిది దాపురించింది. వ్యాపారాలతో అకస్మాత్తుగా డబ్బు సంపాదించిన నయా సంపన్న వర్గం మరింత డబ్బు, పేరు సంపాదించాలనీ, తళుకుబెళుకు తారల మధ్య తారట్లాడాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. అవినీతి సంపాదన కావడం వల్ల ఇష్టమొచ్చినంత డబ్బుపెట్టి సినిమాలు నిర్మిస్తూ వాళ్ల కులాసా కొద్దీ తారలకు భారీ పారితోషికాలిస్తూ వచ్చారు. ఈ నిర్మాతలకు కళాదృష్టి కానీ, సంస్కృతిపట్ల గౌరవం కానీ లేకపోవడంతో శృంగార, అశ్లీల, హింసాత్మక చిత్రాల వైపు మొగ్గు చూపారు. వాళ్లు ఒకే రకమైన సినిమాలు తీయడం ప్రారంభించారు. నేటికీ ఆ రకం సినిమాలే తయారవుతున్నాయి.
మొదట్లో నిర్మాతల అధీనంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉండేవాళ్లు తారలు. అయితే వాళ్లలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ బయలుదేరి, 'కాల్షీట్ల' పద్ధతిలో ఒకేసారి నాలుగైదు సినిమాల్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు. తాము అంత శ్రమ పడగలమో, లేదో కూడా ఆలోచించలేని విధంగా వాళ్ల ఆశలు మితిమీరిపోయాయి. ఫలితంగా సినిమా బడ్జెట్ నిర్మాత అదుపులో లేకుండా పోయింది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు కంటే తారల, సాంకేతిక నిపుణుల పారితోషికాలకే నిర్మాత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన దరిద్రపు స్థితి వచ్చింది. మరోవైపు టెలివిజన్ రాకతో సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. నూటికి పది సినిమాలు మాత్రమే గట్టెక్కే రోజులు వచ్చాయి. దీంతో అసలు చిత్ర పరిశ్రమ నిలుస్తుందా, లేదా అని అసలు సిసలు సినిమా ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తారల్లో మచ్చుకి వెతికినా సహకారమనేది కనిపించడం లేదు. వాళ్లు పూర్వం మాదిరిగానే కోట్లు కావాలని కూర్చుంటున్నారు. వాళ్లడిగిన డబ్బు ఇవ్వడమే కాదు, వాళ్లు సెట్స్‌పైకి ఎప్పుడొచ్చినా.. అదేమని అడగకూడదు. వాళ్లు వచ్చిందే భాగ్యమన్నట్లు అప్పుడే సీన్లు తీసుకోవాలి.
వాళ్లు ఇలాంటి ప్రవర్తనతో తమనెంతంగా బాధపెడ్తున్నా, నిర్మాతలు జీ హుజూర్ అంటున్నారు. చిత్రమేమంటే ఈ బడా తారలు నటిస్తున్న చిత్రాల్లో చాలా భాగం భారీ పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. నిజానికి ఇవాళ చిన్న తారలు నటిస్తున్న సినిమాలే నిర్మాతకు మనశ్శాంతినిస్తున్నాయి. అయినా పెద్ద తారల విలువ తగ్గడం లేదు. వాళ్లపై మోజు అంతకంతకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. స్టార్ సిస్టంను ఈ నిర్మాతలే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. వీళ్లే భారీ పారితోషికాలిచ్చి మరీ ముంబాయి, ఇతర భాషా చిత్రాల నాయికలను, నటులను బుక్ చేస్తున్నారు. దానితో తెలుగు కళాకారులు చికాకు ప్రదర్శిస్తున్న సందర్భాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అప్పనంగా వచ్చిపడుతున్న డబ్బు కారణంగా ఇతర భాషల నటులు తమ సొంత భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాలంటేనే మోజుపడే స్థితికి వచ్చారు.
ఇంత జరుగుతున్నా, పెద్ద తారల సినిమాలకు పరాజయం తప్పడం లేదు. కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనీ, స్టార్ వాల్యూలో ఏమీ లేదనీ తెలుసుకోడానికి ఆ హీరోలు నిరాకరిస్తున్నారు. 'బ్రూస్‌లీ' సినిమాని ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాంచరణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఓ స్టార్ హీరో, ఓ స్టార్ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందనీ, కాసుల వర్షం కురుస్తుందనీ బయ్యర్లు ఆశించారు. జరిగింది అందుకు భిన్నం. గమనించాల్సిన విషయమేమంటే ఈ సినిమాకు మరింత స్టార్ వాల్యూ తీసుకు రావాలనే ఉద్దేశంతో చిరంజీవి కూడా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఓ ఫైట్ చేశారు. అయినా సినిమాని చిరంజీవి స్టార్ వాల్యూ ఏమాత్రం కాపాడలేకపోయింది. ఫలితంగా బయ్యర్లు భారీ నష్టాలకు లోనయ్యారు. ఇదివరకు ఇదే శ్రీను వైట్ల, మరో సూపర్‌స్టార్ మహేశ్‌తో చేసిన 'ఆగడు' సినిమా సైతం ఘోరంగా ఫ్లాపయింది. అందుచేత నిర్మాతలు పెద్ద హీరోల కాళ్లు పట్టుకొని వేళ్లాడే కంటే, తమ దృష్టిని ఎక్కువగా కథపైనా, నిర్మాణ విలువలపైనా పెడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.
సినిమా నిర్మాణంపై ఏమాత్రం అవగాహన లేకుండా కొంతమంది వ్యాపారులు అందులోకి దిగి అనవసరంగా డబ్బును నాశనం చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబుల్లో మురిగిపోతుండటానికి వాళ్ల అజ్ఞానమే కారణం. వీటిపై వందల కోట్ల రూపాయలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితికి డిస్ట్రిబ్యూటర్లు, డబ్బు పెట్టుబడిదార్లు కూడా కారణమే. నిజాయితీ ఉన్న నిర్మాతలకు డబ్బు ఇచ్చేందుకు వెనుకాడి, మోసగాళ్లను మేపడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అందుకే చిత్ర పరిశ్రమ నిరంతర ఒడిదుడుకులతో సతమతమవుతూ సాంకేతికంగా పురోగమిస్తున్నదే కానీ, నిర్మాతల్లో ఎక్కువ శాతం మందికి ఖేదాన్ని కలిగిస్తూ కుంటి నడకతో సాగుతూ ఉంది.
Actor Kumpatla Subba Rao Filmography
1. Sati Sakkubai (1935)
2. Draupadi Vastrapaharanam (1936) (Dhrutarashtra)
3. Mohini Rukmangada (1937) (Haridas)
4. Kanaka Thara (1937) (Malligadu)
5. Kacha Devayani (1938)
6. Dakshayagnam (1941) (Visuna)
2. Draupadi Vastrapaharanam (1936) (Dhrutarashtra)
3. Mohini Rukmangada (1937) (Haridas)
4. Kanaka Thara (1937) (Malligadu)
5. Kacha Devayani (1938)
6. Dakshayagnam (1941) (Visuna)
Friday, December 4, 2015
Synopsis of the movie Balaraju (1948)
'బాలరాజు' (1948) చిత్ర కథాంశం
దేవకన్య మోహిని మంచి నాట్యకత్తె. యక్షుణ్ణి ప్రేమిస్తుంది. మోహిని అపురూప సౌందర్యం ఇంద్రుణ్ణి స్థిమితంగా ఉండనీయదు. ఆమె తన కొలువులో నృత్యం చేయాలని ఆమె తండ్రిని ఆజ్ఞాపిస్తాడు. మోహిని ఒప్పుకోదు. తనకు అడ్డు అయ్యాడనే కోపంతో భూలోకంలో ప్రేమంటే తెలీని జడునివికమ్మని యక్షుణ్ణి శపిస్తాడు. మోహినిని బలవంతంగా తన సభకు రప్పిస్తాడు. నాట్యానికి ససేమిరా అంటుంది మోహిని. ఆవేశంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆమెను మానవ జన్మ ఎత్తి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు.యక్షుడు వెలమవాళ్లింట బాలరాజుగా, మోహిని కమ్మవాళ్లింట సీతమ్మగా పుట్టి పెరుగుతుంటారు. సీతమ్మను ఎవరికంటా పడకుండా ఊరి బయట ఒక ఒంటిస్తంభం మేడలో పెంచుతుంటాడు కమ్మనాయుడు. ఒకరోజు బాలరాజు తన స్నేహితుడు యలమందతో కలిసి ఆ ఇంటిమీదుగా వెళ్లడం చూస్తుంది మోహిని. తొలిచూపుతోనే పాతప్రేమ చిగురిస్తుంది. ఇల్లు విడిచి బాలరాజును కలుసుకుంటుంది సీత. ఆమె నిద్రపోతుండగా జడత్వంతో వెళ్లిపోతాడు బాలరాజు. వద్దన్న కొద్దీ తనవెంట పడుతున్న సీతను మొదట దెయ్యంగా భావిస్తాడు. తర్వాత మంచిదని నమ్ముతాడు.
అడవి దొంగలు మత్తుమందుజల్లి సీతను ఎత్తుకుపోతారు. వెతకడానికి వెళ్ళిన బాలరాజు మునిశాపంతో పాముగా మారిపోతాడు. సీత తప్పించుకువచ్చి పామైన బాలరాజును కలుసుకుంటుంది. తర్వాత వరసబెట్టి కష్టాలొస్తాయి. బాలరాజు చనిపోతాడు. అశ్వనీ దేవతలు ఇచ్చిన సంజీవిమాలతో అతణ్ణి బతికించుకుంటుంది సీత. ఇంద్రుడు మళ్లీ తయారై ఆమెను నిర్బంధిస్తాడు. దాంతోనూ ఫలితం కనిపించక మాయసీతగా మారి బాలరాజుతో సరసాలాడతాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సీత శపించబోయేసరికి శచీదేవి వచ్చి భర్తను కాపాడమనటంతో కథ సుఖాంతం.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్. వరలక్ష్మి, గాడేపల్లి, డి.ఎస్. సదాశివరావు, కస్తూరి శివరావు
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్, గాలిపెంచల నరసింహారావు
నిర్మాత, దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
బేనర్: ప్రతిభా ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి
Thursday, December 3, 2015
Need for Artistic Vision in Film Makers
కూసింత కళాత్మక దృష్టి కావాలి!
నేటి నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువమందికి సినిమా అంటే కేవలం వ్యాపారమే. అందులో కళకు చోటులేదనేది వాళ్ల నిశ్చితాభిప్రాయం. ఒకళ్లతో ఒకళ్లు పోటీపడుతూ ఏడాదికి 150 సినిమాల దాకా తీస్తున్నారు. వాటిలో విజయాన్ని సాధించే సినిమాలు పది, పన్నెండుకంటే మించవు. అవైనా ఎందుకు ఆడుతున్నాయని పరిశీలిస్తే కథా కథనాల విషయంలో అవి మిగతా వాటికంటే మెరుగ్గా ఉండటం, తెలిసో తెలియకో వాటిల్లో ఎంతోకొంత కళాదృష్టి కనిపించడం.ఉదాహరణకు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన 'బాహుబలి', 'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్' చిత్రాల్ని తీసుకుందాం. 'బాహుబలి' సాంఘిక సినిమా కాదు. అది జానపదం. అందులోనిది బలమైన కథ కాదు. కథనం, కంటికి 'అబ్బో' అనిపించే విజువల్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, ఉద్వేగభరితమైన సన్నివేశాల కారణంగా అది జనానికి నచ్చేసింది.
'శ్రీమంతుడు' సినిమా కథ గొప్పదేమీ కాదు. కానీ అందులోని అంశం ప్రజలకు బాగా పట్టేసింది. రాబందుల వంటి భూ బకాసురులు పీక్కుతింటున్న తన సొంత ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేసుకున్న యువకుడి విశాల హృదయాన్ని జనం మెచ్చారు. అందులో కథానాయకుడు కోట్లకు వారసుడైనా, కార్లలో తిరగడానికంటే, సైకిల్‌పై ప్రయాణానికే ఇష్టపడతాడు. అందుకే ఆ సినిమా వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. సంపన్నవంతులు వెనుకబడిన గ్రామాల్ని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన సినిమా ఇటీవలి కాలంలో మరొకటి లేదు. ఇక 'భలే భలే మగాడివోయ్' సినిమా విషయానికొస్తే, అది తక్కువ బడ్జెట్‌తో తయారైనా, ప్రజల మనసుల్ని భారీ స్థాయిలో గెలుచుకుంది. చిన్నతనం నుండే తీవ్ర మతిమరుపు రుగ్మతను కలిగి ఉండే ఓ యువకుడు ప్రేమలోపడి, తన మతిమరుపు కారణంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని, చివరకు ఎలా అందరి హృదయాల్ని దోచుకున్నాడనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. కథానాయకుడి అమాయకత్వం, తన మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆడే అబద్ధాలు ప్రేక్షకుల్లో సానుభూతినే కలిగించాయి కానీ, విముఖతని కలిగించలేదు. ఈ రకంగా ఈ మూడు సినిమాల్లో ఎంతోకొంత కళాత్మకత కనిపిస్తుంది.
అలాగే శేఖర్ కమ్ముల, క్రిష్ వంటి దర్శకులు కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా, వాస్తవిక దృష్టితో సినిమాలు తీస్తున్నారు. శేఖర్ కమ్ముల 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో జీవితంలోని భిన్న కోణాలు మనకు దర్శనమిస్తాయి. కాకపోతే వాటిలో జీవన సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆయనకు కాస్త భిన్నంగా క్రిష్ దర్శనమిస్తాడు. జీవితంలోని ఆనంద ఘడియల వెనుకే విషాదం కూడా ఉంటుందని ఆయన సినిమాలు చూపిస్తాయి. 'గమ్యం', 'వేదం', 'కంచె' సినిమాల్లో అటు ఆనందమూ, ఇటు విషాదమూ రెండూ కనిపించడం మనం చూడవచ్చు. 'కృష్ణం వందే జగద్గురుం'లో విషాదం బదులు తెలుగువాళ్లకు ఒకప్పుడు ఎంతో ప్రీతిపాత్రమైన రంగస్థల నాటకాన్ని బతికించుకోవాలనే తపన, మైనింగ్ మాఫియాపై పోరాడాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తాయి. అంటే రెగ్యులర్ సినిమాల్లో కనిపించే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అనవసర భావోద్రేక సన్నివేశాలు, కథకు సంబంధంలేని రోత కామెడీ ట్రాకుల ఫార్ములా వీళ్ల సినిమాల్లో కనిపించని సంగతి గ్రహించాలి.
ఇదివరకు దర్శకులు సెల్ఫ్ సెన్సారింగ్ పాటించి ప్రేమ సన్నివేశాలను హద్దుల్లో ఉంచేవాళ్లు. వాటివల్ల ప్రజలకు అవి ఎలాంటి హానీ కలుగచేయని రీతిలో ఉండేవి. అందరి ఆదరణ పొందేవి. కానీ రాను రాను విదేశీ మోజుకు, కృత్రిమ నాగరికతకూ అలవాటుపడిన దర్శకులు ప్రణయ ఘట్టాల్ని విచ్చలవిడిగా తీయడం మొదలుపెట్టారు. టీనేజ్ లవ్‌స్టోరీల పేరుతో, కాలేజీ ప్రేమకథల పేరుతో బూతు చిత్రాలు తీస్తూ వస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉండే, ఉడుకు రక్తం ఉరకలు వేసే పిల్లల్లో అవి కలిగించే మానసిక వికారాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సినిమాల్ని పిల్లలతో కలిసి చూడాలంటే పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. కాలేజీలు ఎగ్గొట్టి ఇలాంటి సినిమాలు చూస్తూ అవే నిజమైన ప్రేమలుగా భ్రమించి, అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించే సంఘటనలు ఇవాళ సమాజంలో నిత్యకృత్యమైపోయాయి. 'నిర్భయ' వంటి సంఘటనలు పెచ్చుమీరిపోవడానికి బూతు సినిమాల ప్రభావమే ప్రధాన కారణం. ఇలాంటి సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ, మంచి సినిమాల సంఖ్య తరుగుతూ రావడానికి కారణం ఎవరో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మంచి సినిమా తీస్తే దాన్ని ఆస్వాదించే హృదయాలు ఎన్ని? నిర్మాతలు ఇలాంటి మూస కమర్షియల్ సినిమాల్నే ఎక్కువగా నిర్మించడానికి కారణం.. వాళ్లకు డబ్బే ప్రధానం. ఎలాంటి సన్నివేశం తర్వాత ఎలాంటి సన్నివేశం వస్తే జనం ఈలలు వేస్తారు, లాభాలు ఎలా వస్తాయి, ఏ హీరోతో తీస్తే జనం ఎక్కువగా వస్తారు, ఏ డైరెక్టర్‌కు స్టార్ వాల్యూ బాగా ఉంది.. అనే బాక్సాఫీస్ సూత్రాలకు లోబడిపోయి తమ సినిమాల్ని కేవలం వ్యాపారం కోసమే తీస్తున్నారు.
వర్తమానం కంటే గతమెంతో ఘనం అనేది పాత చింతకాయ పచ్చడి లాంటి నానుడి కావచ్చేమో గానీ, తెలుగు సినిమాకు సంబంధించి అది అక్షరాలా నిజం. గతంలోని సినిమాల్లో నటీనటుల నటన ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయి ఉంది. ఇప్పటి ఏ నటుడి అభినయం గురించి గొప్పగా మనం చెప్పుకోగలం? కారణం మునుపటి తారలు నటనను ఓ కళగా భావించి, పాత్రను, దాని స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆ పాత్రల్ని సొంతం చేసుకొనేవాళ్లు. ఇప్పటి ఏ నటుడు కానీ, నటి కానీ నటనను కళగా భావించి పాత్ర పోషణ చేస్తున్నారు? ఓ సినిమా చేస్తే ఎంత పారితోషికం అందుతుందనే ధ్యాస తప్పితే, నటనపై అంకితభావం చూపించేవాళ్లు కనిపిస్తారా? ఇవాళ హీరో కావాలంటే నటనకంటే డాన్సులు బాగా వచ్చుండాలి. ఫలానా హీరో బాగా నటించాడని చెప్పుకోవడం కంటే బాగా డాన్సులు, ఫైట్లు చేశాడని చెప్పుకోవడమే గొప్పయింది.
ఇక దర్శకుడి విషయానికి వస్తే పూర్వం తన శక్తివంచన లేకుండా చిత్రాన్ని ఆద్యంతం నవరసాలతో కళాత్మకంగా రూపొందించేవాడు. దర్శకునికి తగినట్లు నటీనటులు అభినయాన్ని ప్రదర్శించి పూర్తి సహకారం అందించేవాళ్లు. అంటే సమష్టి కృషివల్ల సినిమా విజయవంతమై నిర్మాతకు ఇంకో సినిమా తియ్యడానికి ముందడుగు వేసే ధైర్యం వచ్చేది. కానీ ఇవాళ్ల దర్శకునికే దర్శకులుగా మారిపోయారు తారలు. దాంతో దర్శకుడు మనసుకి ఎంత కష్టంగా ఉన్నా రాజీపడి సినిమాని పూర్తిచేశాననిపిస్తున్నాడు.
స్వర్ణయుగ సినిమాల విజయాల పరంపరకూ, ఇప్పటి సినిమాల విజయానికీ తేడాని పోలిస్తే ఎంతో కనిపిస్తుంది. అప్పుడు తయారయ్యే సినిమాల సంఖ్య తక్కువ. అవి కళాత్మకంగా ఉండేవి. ప్రజాదరణ అమితం. ఇప్పుడు సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. అంతా వ్యాపార దృష్టే. కళాదృష్టి అసలు లేదు. అందువల్ల ఇప్పటి సినిమాలు అభిరుచి కలిగిన సినీ ప్రియుల్ని ఆకర్షించలేకపోతున్నాయి. కళకూ, ప్రజాదరణకూ సంఘర్షణ రావాల్సిన అవసరం లేదు. సమర్థుడైన దర్శకుడు కళను కించపరచకుండానే ప్రజారంజకమైన చిత్రాలు తీయగలడని అలనాటి కేవీరెడ్డి నుంచి, నిన్నటి కె. విశ్వనాథ్ నుంచి, ఇవాళ్టి క్రిష్, క్రాంతిమాధవ్ దాకా నిరూపిస్తూనే ఉన్నారు. మనకు జాతీయంగా పేరు వచ్చేది ఇలాంటి దర్శకులవల్లే. అందువల్ల మన నిర్మాతలు, దర్శకులు సినిమాలో వ్యాపారానికే తప్ప కళకు చోటు లేదన్న భ్రమలోనే ఉంటూ కళను విస్మరించకుండా కళాఖండాలను, దృశ్యకావాలనూ తీయవచ్చని గుర్తించాలి. దానికి కావాల్సిందల్లా కూసింత ఆత్మవిశ్వాసం.
Wednesday, December 2, 2015
Actor Addanki Srirama Murthy Filmography
1. Bhakta Kuchela (1935)
2. Harischandra (1935)
3. Nara Narayana (1937) (Dharmaraju)
4. Sarangadhara (1937) (Rajaraja Narendra)
5. Chitra Naleeyam (1938)
6. Mahananda (1939)
7. Bhoja Kalidasa (1940)
8. Bhaktimala (1941)
contd...
2. Harischandra (1935)
3. Nara Narayana (1937) (Dharmaraju)
4. Sarangadhara (1937) (Rajaraja Narendra)
5. Chitra Naleeyam (1938)
6. Mahananda (1939)
7. Bhoja Kalidasa (1940)
8. Bhaktimala (1941)
contd...
Synopsis of the movie Varalakshmi Vratam (1961)
'వరలక్ష్మీ వ్రతం' (1961) చిత్ర కథాంశం
అనగనగా ఓక రాజు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. సహజంగానే పెద్ద భార్య ఉత్తమురాలు. రెండో భార్య చూపులకు మొద్దుగా ఉన్నప్పటికీ రాజుగారికి మాత్రం ముద్దుగానే ఉంటుంది. అంతటి మనిషి అక్కకంటే ముందుగానే కొడుకును కని తన ప్రతిభను చాటుకుంది. ఆ పుత్రరత్నమే కాబోయే రాజు అని ఉవ్విళ్లూరుతోంది. అది జరిగితే కథేముంది? పెద్దరాణి ఉన్నన్నాళ్లూ ఊరుకొని లేటు వయసులో గర్భం దాల్చింది. ఆమె కడుపులో పెరుగుతున్న పిండం చిన్నరాణి ఆశలకు గండం అయింది. ఆమెకు జోస్యం తెలుసో లేక స్కానింగ్ కళ్లు ఉన్నాయో కానీ, పెద్దరాణికి కొడుకే పుడ్తాడని తమ్ముడితో గట్టిగా అరిచి మరీ చెప్పింది. అందుకని ఆమెను అంతం చేయమని తమ్ముడికి నూరిపోసింది. ఒక మాంత్రికుడి సహాయంతో చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ మాంత్రికుడికీ, అతని ఇద్దరు శిష్యులకూ బోడిగుళ్లు దక్కాయి. ఆపైన గాడిదపై ఊరేగే భాగ్యమూ లభించింది.
పెద్దరాణి కొడుకుని కనేసింది. ఆ పసికందును తమ్ముడిచేత హత్యచేయించడానికి ప్రయత్నించింది చిన్నరాణి. కాని ముసలి మంత్రి తెలివితేటల వల్ల రాకుమారుడు తప్పించుకొని ఒక స్వామిభక్తి పరాయణుడి ఇంట పెరుగుతాడు. అతనికి బదులు ఆ భక్తుడి కొడుకు హత్యకు గురవుతాడు. ఆ పిల్లల తల్లులు ఎంతటి సత్తెకాలపు వాళ్లంటే పిల్లలు మారిపోయినా వాళ్లకు తెలీదు.
పనిలో పనిగా రాజుగారిని ఫినిష్ చేసి లైన్ క్లియర్ చేస్తాడు. ఆపైన రాణీని, ఎక్కడ తనకు ద్రోహం చేస్తుందోనని తన అక్కని జైలులో పెట్టేస్తాడు. తానే రాజ్యం చేపడతాడు.
సినిమా కథలో విధి బలీయంగా ఉంటుంది కాబట్టి అతని కూతురు మణిమంజరి, అజ్ఞాత రాకుమారుడు తొలిచూపులోనే ప్రేమించేసుకుంటారు. ప్రేమకు ఫలం దక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అందుకు తగ్గట్లే ఆ కష్టాలన్నీ దుష్టుల రూపంలో వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసి నాయికను వరలక్ష్మీదేవి భక్తురాలిగా చేస్తాయి. ఈలోగా రాజకుమారిని దుష్టులు చెరబట్టబోగా, ఒక యక్షిణి రాకుమారుని చెరబట్టి, తన లోకానికి తీసుకుపోయి షికార్లకు వెళ్లేప్పుడల్లా కాగితం పువ్వుగా మారుస్తుంటుంది.
గుండు కొట్టించుకున్న ఒక మాంత్రికుడు మాయలూ మంత్రాలతో హంగామా చేస్తుంటాడు. ఏదైతేనేం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరిగి విడిపోయిన దంపతులను ఏకంచేసి తన మహత్యం నిరూపించుకుంటుంది వరలక్ష్మి.
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, బాలకృష్ణ (అంజి), ముక్కామల, మిక్కిలినేని, స్వర్ణలత, మీనాకుమారి, జగ్గారావు, అల్లు రామలింగయ్య, కాకరాల, ఆదోని లక్ష్మి
సంగీతం: రాజన్ - నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్
Subscribe to:
Posts (Atom)





