"ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేది బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను'' అని చెప్పారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా దర్శకుడు వి.వి. వినాయక్ రూపొందించిన 'బద్రినాథ్' సినిమా ఇటీవల విడుదలై భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా గురించీ, ఇతర అంశాల గురించీ సంభాషించారు అర్జున్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఇది పెద్ద మాస్ ఇమేజ్ వచ్చే కథ. అన్ని విషయాలూ ఉన్న కమర్షియల్ కథ. సినిమాకి మొదట డివైడ్ టాక్ ఉన్నా, కచ్చితంగా ఆడే అంశాలు ఉన్నాయి. అందుకే టాక్‌కి భిన్నంగా కలెక్షన్లు బలంగా ఉన్నాయి. సినిమాలో విషయం ఉంది కాబట్టే, తాము కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి కాబట్టే జనం బాగా చూస్తున్నారు. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ వల్ల మొదట అలాంటి టాక్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల ధోరణి ఇలాగే కొనసాగితే చిత్రసీమలోని అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుంది. నా కెరీర్‌లో ఇవి హయ్యస్ట్ ఓపెనింగ్స్. నా మునుపటి టాప్ సినిమాల కలెక్షన్లని 'బద్రినాథ్' వారంలోనే దాటేస్తుంది.
32 గంటల సమయం
కత్తి పట్టుకోవడం కొత్త పాయింట్ కాదు. పాతదే. కానీ అందులోనే కొత్తదనం చూపించాలి. హాంగ్‌కాంగ్, చైనీస్ సినిమాల్లో వాళ్లు కత్తి పట్టుకునే విధానం మనవాళ్లు పట్టుకునే దానికి భిన్నంగా, మరింత సాధికారికంగా ఉంటుంది. అందుకే వియత్నాం వెళ్లి రెండు నెలలు పాటు కత్తి తిప్పడంలో శిక్షణ పొందా. 'బద్రినాథ్'లో సమురాయ్ టైపు ఫైట్స్ చేయడానికి ఇదే కారణం. ఇక పొడవాటి జుట్టు విషయానికొస్తే ఆ కృత్రిమ జుట్టు పెట్టించుకోవడానికి 32 గంటల సమయం పట్టింది. అంతసేపూ ఓపిగ్గా కూర్చోవాల్సిందే. కానీ తీసేయడానికి అరగంట చాలు.స్టంట్స్ కంటే డాన్సే కష్టం
చిరంజీవి మావయ్య డాన్స్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆయన్ని గుర్తుకు తేవాలని కావాలనే ఓ పాటలో కొన్ని బిట్స్ ఆయనలా చేశా. యాక్షన్ ఎపిసోడ్స్ చెయ్యడం కంటే డాన్సు చెయ్యడమే కష్టం. స్టంట్స్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి బాగా తీయొచ్చు. అందుకే ఇవాళ 'యాక్షన్ ఎంత బాగా చేశాడు!' అనడం లేదు. 'ఎంత బాగా తీశాడు!' అంటున్నారు. డాన్సుకి అలా కుదరదు. ఫిజికల్‌గా చెయ్యాల్సిందే. 'మగధీర' లక్ష్యం కాదు
'మగధీర' అందరికీ ఓ బెంచ్‌మార్క్ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది అలాంటి సినిమాలు చెయ్యాలనుకుంటున్నారు. దెబ్బతింటున్నారు. కానీ భారీ స్థాయిలో సినిమా తియ్యడానికి అది ఓ ఉదాహరణగా మారింది. సృజనాత్మక స్వేచ్ఛనిచ్చింది. అయితే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని మేం 'బద్రినాథ్' తియ్యలేదు. సృజనాత్మక విషయంలోనే దాన్నో ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ హీరో, హీరోయిన్, డైరెక్టర్, మిగతా పెద్ద టెక్నీషియన్ల పారితోషికాలనేవి బడ్జెట్‌లో పెద్ద భాగం. సొంత సినిమా కాబట్టే చేశా. బయటి నిర్మాతలైతే చేసేవాణ్ణి కాను. సినిమా బడ్జెట్ పెరగడానికి ఏ ఒక్కరో కారణం కాదు. అందరూ కారణమే.బెస్ట్ మాస్ డైరెక్టర్
వినయ్ (వినాయక్)తో పనిచెయ్యడమంటే చాలా చాలా ఇష్టం. 'బన్ని' తర్వాత మేం కలిసి చేసిన సినిమా. అతని సినిమాలో ఎక్కడా వృథా అనేది కానీ, అనవసరమైనది కానీ ఉండదు. హి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ డైరెక్టర్స్. వినయ్‌తో సినిమా అంటేనే మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చేస్తుంది. కాంబినేషన్ వల్ల నష్టమేం లేదు. పైగా దానివల్ల సినిమాకి హైప్ వస్తుంది. స్టార్‌కేస్ట్ ఉంటే ఎవరిమైనా ఆసక్తి చూపిస్తాం కదా. క్రేజీ కాంబినేషన్ల వల్ల హిట్లు, ఫ్లాప్టు రెండూ ఉన్నాయి. అయితే కాంబినేషన్ ఒక్కటే సరిపోదు. మంచి కథ ఉండాలి.మోస్ట్ సిన్సియర్ గర్ల్
'హ్యాపీడేస్' అప్పట్నించీ తమన్నాతో చెయ్యాలని ఉంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చి మా సంస్థ తరపున ముందుగానే ఆమెని బుక్ చేశాం. మొదట '100% లవ్'కి తీసుకున్నాం. అది హిట్టవడంతో 'బద్రినాథ్'కి ఆమె ఓ ప్లస్ పాయింటయ్యింది. ఇప్పటివరకు నేను పనిచేసిన హీరోయిన్లలో అంకితభావం ఉన్న 'ద మోస్ట్ సిన్సియర్ గర్ల్'.
No comments:
Post a Comment