Monday, May 2, 2011
రోజారమణికి రాష్ట్రపతి ప్రశంస
'భక్త ప్రహ్లాద'ను అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చూపించేందుకు ప్రివ్యూ ఏర్పాటు చేశారు ఏవీయం చెట్టియార్. పెద్ద సినిమా కావడంతో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఆ సినిమా చూసేందుకు రాధాకృష్ణన్ సరేనన్నారు. తొలి సగం చూశాక 'ప్రహ్లాదుడిగా చేసిన బాబు ఎవరు?' అనడిగారు. 'బాబు కాదు పాప' అని ఏవీయం వాళ్లు చెప్పాక, ఆశ్చర్యపోయిన ఆయన 'ఆ పాపను రప్పించండి' అని చెప్పారు. రోజారమణి తల్లి అప్పుడు ప్రెగ్నంట్ కావడంతో కూతుర్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు సత్యం. రోజారమణిని తన పక్కనే కూర్చుండ పెట్టుకుని, సినిమా సెకండాఫ్ చూశారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి భవన్‌లో భోజనం పెట్టించారు. ప్రహ్లాదుడిగా నటించినందుకు ఒక ప్రశంసాపత్రం ఇచ్చారు. అదే పాత్రకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ బాలనటి అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా అందుకుంది బాల రోజారమణి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment