సాకీ:
నీయమ్మ
ఆ కళ్లేంటే..
ఆ ముక్కేంటే..
ఆ కాళ్లేంటే..
ఆ నడుమేంటే..
ఏంటే.. ఏంటే..
పల్లవి:
అతడు: ఏవెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను ||ఏవెట్టి||
అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
నీ ఒంట్లో అణువు అణువు నా ఒంట్లో అణుబాంబై
పేల్చేస్తుందే నీ అందం నన్ను
కాల్చేస్తుందే ఈ హాటు సన్ను ||పేల్చేస్తుందే||
ఆమె: నీయబ్బ..
ఏవెట్టి పెంచార్రా అమ్మానాన్న నిన్ను
నన్నిట్టా చంపుతున్నవ్ డే అండ్ నైటు జాను ||ఏవెట్టి||
అవి కండలా.. రాతి బండలా
అది నడకా.. సూపర్ స్టైలా
నీ కంటి ఆ చూపే నా ఒంటికి యమషాకై ||నీ కంటి||
ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు ||ఉడికిస్తుంద్రా||
చరణం 1:
అతడు: జెన్నిఫర్ మడొన్నాని మిక్సింగ్ చేసి వాడు
నిన్నిట్టా భూలోకానికి చేసాడేమె లోడు
ఆమె: షారుఖ్‌కి హృతిక్‌కి షేకిచ్చేసి వీడు
వండర్‌గా నాకె ఏదో టెండర్ పెట్టేసాడు
అతడు: వై2కె వైరస్‌లాగ వ్యాపించావె ఒళ్లంతా
ఆమె: పిచ్చిట్టా పట్టేలాగ ఏదో చేసేసావిట్టా
అతడు: ఐ డోంట్ నో వాట్ టు డు బేబీ.. ||ఏవెట్టి||
చరణం 2:
ఆమె: మహేషుబాబుని కూడా ఛీఛీ పో అన్నాను
నీ హైటు స్మార్టు చూసి నీ వల్లో పడ్డాను
అతడు: ఐపీఎల్ ఛీర్ గర్ల్‌లా వుంటుందే నీ మేను
ఒంపుల్తో క్రికెట్ ఆడేస్తున్నావే నన్ను
ఆమె: మేగ్నెట్‌లా నిన్నంటి వుంటారా రోజంతా
అతడు: చిక్‌లెట్‌లా నమిలేస్తా నీ బుగ్గల్ని రాత్రంతా
ఆమె: నౌ యు నో వాట్ టు డు బేబీ
అతడు: ||ఏవెట్టి||
ఆమె: ||ఏవెట్టి||
అతడు: అవి పెదాలా రసగుల్లాలా.. అది నడుమా ఐసు క్రీమా
ఆమె: ఉడికిస్తుంద్రా నా బాడీ పార్ట్లు
అనిపిస్తుంద్రా ఒళ్లంతా స్వీట్లు
- ఎవరు రాసిందీ పాట.. ఏంటీ పాట.. ఈ పాటలో ఆ భాషేంటి.. అనుకుంటున్నారా? అదేమరి. ఈ పాట రాసింది స్వయానా రాంగోపాల్‌వర్మ. తను డైరెక్ట్ చేస్తోన్న 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-అప్పల్రాజు' సినిమా కోసం ఈ పాటని వర్మ రాశాడు. ఈరోజు ఈ పాటని మార్కెట్లో విడుదల కూడా చేశారు. ఈ పాటని తనే ఎందుకు రాశాడో కూడా వర్మ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపాడు. ఏ సందర్భంగా ఆ పాట వస్తుందో కూడా చెప్పాడు.
"ఈ పాటని ఇంకో గీత రచయిత తోటి రాయించకుండా నేనే రాయడానికి నా కారణం.. నా దృష్టిలో స్త్రీ అందాన్ని నా కన్నా తాదాత్మ్యంగా ఇంకెవ్వరూ చూడరు.. చూడలేరు. ఆ మహోన్నత అందమే ఒక కఠోరమైన రాయిలాంటి నన్ను కూడా ఒక కవిలా మార్చేసింది. ఆ అందాల విందుకు నేను దాసుడినై, ఆ అభినవ దేవతకు ఒక బానిసనై.. స్త్రీని భగవంతుడు సృష్టించిన అత్యంత మహా సృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి రాసిన పాటే ఈ 'ఏమెట్టి పెంచారే అమ్మానాన్న నిన్ను?'. ఈ నా పాట స్త్రీలందరికీ అంకితం" - ఇదీ ఈ పాట రాయడానికి వర్మ చెప్పిన కారణం.
1 comment:
ఆ మెంటల్ డైరెక్టర్ నుండి ఇంతకంటే ఆశించగలమా?
Post a Comment