Saturday, May 21, 2011
ఫ్లాష్‌బ్యాక్: 'జగదేకవీరుని కథ'లో జలకాలాటల సీను
'జగదేకవీరుని కథ'లో జలక్రీడల సన్నివేశం ఎంత జగన్మోహనంగా ఉంటుందో దాన్ని చూసిన వాళ్లందరికీ తెలిసిందే. వరుసగా కొన్ని రోజులు ఆ సన్నివేశాన్ని షూట్ చేశారు. వాహినీ స్టూడియోలోనే ప్రత్యేకంగా కొలను నిర్మించి స్నాన సన్నివేశాలు తీశారు. బి. సరోజాదేవి, ఆమె చెలికత్తెలు, రామారావు వంటి తారలు రోజంతా నీళ్లల్లో ఉండి, జలుబుచేసి షూటింగుకు ఆటకం కలిగితే ఎట్లా? అందుకని చన్నీళ్ల కొలనుని వేడి సరస్సుగా మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ కృత్రిమ సరస్సు చుట్టూ కొంచెం దూరంలో అంటే కెమెరా ఫీల్డులోకి రాని దూరంలో బాయిలర్లు పెట్టారు. తారలు నీళ్లలో దిగేముందు ఈ బాయిలర్ల నుంచి వేన్నీళ్లు ఆ కొలనులో పోశారు. తారలకు ఇక భయం లేదనుకుంటే సన్నివేశానికి కొత్త బెడద వచ్చింది. బాయిలర్ల నుంచి వచ్చిన వేడి నీళ్ల వల్ల ఫ్లోర్‌లో ఎక్కడ చూసినా ఆవిరి. జానపద సినిమాకి ఆ పొగలు పనికిరావు. మరైతే ఆవిరి లేకుండా కొలనుని ఎలా వేడి చేయాలి? దాంతో బాయిలర్లు తీసేసి కరంటు తీగలు తగిలించి నీటిని వేడి చేశారు. తారలకి జలుబు ప్రమాదం తప్పడమే కాక, ఆ సీన్లు రసవత్తరంగా వచ్చాయి.
Friday, May 20, 2011
ఇంటర్వ్యూ: 'వీర' దర్శకుడు రమేశ్‌వర్మ
'వీర' పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్. సృజనాత్మక పరంగా చెప్పుకోవాల్సింది తక్కువైనా మంచి ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ఉన్న సినిమా. ఇందులో నేనేమీ ప్రయోగాలు చెయ్యలేదు. అయినా పాత్ర పరంగా రవితేజ కొత్తగా కనిపిస్తారు. 'విక్రమార్కుడు'లో ఆయన చేసిన ఫుల్ మాస్, యాక్షన్ రోల్ విక్రమ్ రాథోడ్‌ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. 'వీర'కి స్ఫూర్తి ఆ పాత్రే. ఇందులో రవితేజ రెండు ఛాయలున్న పాత్ర చేశారు. ఒకటి సెక్యూరిటీ గార్డు దేవా, ఇంకొకటి ఊరికి రాబిన్‌హుడ్‌లాంటి వీర. ఇంట్లో మాత్రం వీర వెంకట సత్యనారాయణ. మామూలుగా ఎంత వినయంగా ఉంటాడో, తన వాళ్లకి ఏదైనా జరిగితే రాక్షసంగా మారిపోతాడు. అంటే ఇటు వినయం, అటు రాక్షసత్వం మేళవింపు 'వీర' పాత్ర. దీన్ని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా.
బంగారంలాంటి మనిషి
'వీర' క్యారెక్టరైజేషన్ నచ్చి ఈ సినిమా చేశారు రవితేజ. ఫస్ట్ సిటింగ్‌లోనే ఓకే చేశాడు. 2010 జనవరిలో ఈ కథ చెప్పా. మొదటి రోజు ఏం చెప్పానో, తెరమీద అదే చూపించా. ఈ సినిమా చెయ్యడంలో రవితేజ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అలాంటి హీరో ఉంటే ఏమైనా చేయొచ్చు. బంగారం లాంటి మనిషి. టైటిల్ రోల్‌ని చాలా బాగా చేశారు. చాలా గ్లామరస్‌గా కనిపిస్తారు. ఇరవై రోజులు మండుటెండల్లో, వారం రోజులు వర్షంలో తడుస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు.
'యాన్ యారో హెడ్ ఆఫ్ యాక్షన్' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్లు ఇందులోని యాక్షన్ జనం గుండెల్లో గుచ్చుకుంటుంది. అదే కాదు, ప్రతి ఎమోషనూ అంతే. 'వీర' గెటప్, స్టైల్ ఆలోచన నాదే అయినా తెర మీద అంత బాగా ఆయన గెటప్ కనిపించడంలో కాస్ట్యూమ్ డిజైనర్ శ్వేత, మేకప్‌మన్ శ్రీను పాత్ర ఎంతో ఉంది.
బాధ్యతతో చేశా
92 పని దినాల్లో 'వీర' పూర్తి చేశాం. నిజానికి మొదట అనుకున్న షెడ్యూలు 140 రోజులని. బడ్జెట్ ఏమనుకున్నామో, దాని లోపలే చేశాం. అవసరమున్నా, లేకపోయినా ఇష్టమెచ్చినట్లు ఖర్చు చెయ్యడం నాకు రాదు. నిర్మాతలు ఈ ప్రాజెక్టుని నాకు అప్పజెప్పారు. అందుకే ఎంతో బాధ్యతతో ఈ సినిమా చేశా. నిర్మాతల, హీరో సహకారం వల్లే హ్యాపీగా ఈ సినిమా చేయగలిగా. సాధారణంగా తను చేసిన సినిమాల్ని ముందుగా చూడరు రవితేజ. కానీ ఎందుకో ఈ సినిమా చూశారు. 'చాలా బాగుంది' అన్నారు.
ఇద్దరూ సమానమే
తాప్సీ, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. ఇద్దరికీ సమాన ప్రాతినిథ్యం ఉంటుంది. కాజల్ గ్రామీణ యువతిగా పూర్తి మాస్ పాత్రలో తొలిసారి కనిపించబోతుంటే, తాప్సీ నగర యువతి పాత్రని చేసింది. శ్యామ్, శ్రీదేవి మరో జంటగా కనిపిస్తారు.
ఆయన్ని ఇబ్బంది పెట్టా
ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. సొంత తమ్ముడిలా చూసుకున్నారు. నచ్చేదాకా పనిచేయించుకునే మనస్తత్వం నాది. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టా. అయినా అర్థం చేసుకుని, మంచి ఔట్‌పుట్ వచ్చేందుకు బాగా సహకరించారు. అలాగే తమన్ అద్భుతమైన సంగీతాన్నిచ్చాడు. అతను మరో చక్రవర్తి. ఆయనలాగే చాలా స్పీడుగా పనిచేస్తాడు. పది రోజుల్లో పాటల ట్యూన్లు, పది రోజుల్లో రీ రికార్డింగ్ అందించాడు.
రవితేజతోటే 'వాడే వీడు'
'ఒక ఊరిలో..' యావరేజ్‌గా ఆడితే, 'రైడ్' హిట్. ఇప్పుడు 'వీర' సూపర్ హిట్ కాబోతోంది. నా అనుభవంలో చిన్న సినిమాకే ఎక్కువ కష్టపడాలి. పెద్ద సినిమా చెయ్యడమే సులువు. హీరో ఇమేజ్‌ని దృష్టి పెట్టుకుని పనిచేస్తే చాలు. రవితేజ వల్లనే ఇలాంటి ఫీలింగ్ కలిగిందనుకుంటా. ఈ చిత్రంతో కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్స్‌ని రమేశ్‌వర్మ బాగా డీల్ చేస్తాడనే పేరు వస్తుందని వంద శాతం నమ్మకంతో ఉన్నా. ఈ సినిమా తర్వాత మళ్లీ రవితేజతోనే చెయ్యాలనుకుంటున్నా. 'వాడే వీడు' అనే కథ రెడీ చేస్తున్నా. ఇందులో రవితేజ ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఒకటి క్లాస్, ఒకటి మాస్.
సినిమా రివ్యూ: వీర
'వీర'ని చూసి నేనేమీ ఆశ్చర్యపడలేదు. అది సరిగ్గా ఇలాగే ఉంటుందని అనుకోకపోయినా ఇంతకంటే బాగుంటుందని మాత్రం అనుకోలేదు. ఇదివరకే నేను పోస్ట్ చేసినట్లు డైరెక్టర్ రమేశ్‌వర్మతో మాట్లాడినప్పుడే ఈ సినిమా భవితవ్యం ఏమిటో నాకు అవగతమైంది. సినిమా చూస్తుంటే నాకు రవితేజ స్థానంలో బాలకృష్ణే కనిపిస్తూ వచ్చాడు. 'నరసింహనాయుడు' నుంచి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా సుమోలు పైకి లేవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రవితేజ సినిమాలోనూ అదే పాత చింతకాయ పచ్చడి సీనే ఉండటం తెలుగు సినిమా ఏమీ ఎదగలేదనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది బాలకృష్ణ కోసమే తయారు చేసిన సబ్జెక్ట్ అనేది మనకు అడుగడుక్కీ తెలిసిపోతూనే ఉంది. ఆయన యాక్ట్ చేసిన 'సమరసింహారెడ్డి' నుంచి 'సింహా' దాకా అన్ని హిట్ సినిమాల్ని కలిపి ఈ కిచిడీ కథని తయారుచేశాడు రమేశ్‌వర్మ. 'నరసింహనాయుడు'లో సిమ్రాన్ చనిపోయే సీను, నిన్న కాక మొన్న వచ్చిన 'సింహా'లో నయనతార చనిపోయే సీను జ్ఞాపకం తెచ్చుకోండి. అవే సీన్లని కాపీ కొట్టి ఇందులో కాజల్ చనిపోయే సీను తయారు చేశాడు రమేశ్. తను ఇప్పటికే నాలుగైదు సార్లు చేసిన కథనే రమేశ్ వినిపించాడని కొద్ది ఆలస్యంగా గ్రహించిన బాలకృష్ణ ఈ కథ పట్ల విముఖత చూపించాడు. తనకి ఇలాంటి మాస్ కథ కొత్త కాబట్టి రవితేజ ఒప్పుకున్నాడు.
బ్రహ్మానందం, రవితేజ కాంబినేషన్లో వచ్చే తాగడు సీన్లు నవ్వు పుట్టించడానికి బదులు చీదర పుట్టించాయి. ఇప్పటికే ఆ తరహా సీన్లు ఎన్నో సినిమాల్లో చూసేశాం. డైరెక్టర్లో ఏమాత్రం క్రియేటివ్ ఎనర్జీ లేదని ఎన్నో సీన్లు చెప్పాయి. తాప్సీ పాత్ర కేవలం ఇమాజినేషన్లో పాటలు కనడానికి మాత్రమే పరిమితమైపోయింది. కాజల్ పాత్రనీ సరిగా మలచలేదు. ఊరికే పెద్ద దిక్కులాంటి 'వీర'ని తనలో ప్రేమ పుట్టించాకే శోభనమంటూ ఆమె కబడ్డీ ఆడటం 'వీర' పాత్ర గౌరవాన్ని పూచిక పుల్లలాగా తీసేయడమే. సెకండాఫ్‌లో బ్రహ్మానందం ఏమైపోయాడో ఎవరికీ తెలీదు.
ఎంతో ఎనర్జీతో తెరమీద వీరంగమాడే రవితేజ 'వీర' పాత్రలో డల్లయిపోయాడు. తమన్ మ్యూజిక్ కొత్తగా వినిపించడం మానేసింది. ప్రతి సినిమాలో ఒకేరకపు బీటుతో చంపేస్తున్నాడు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఒకటే కాస్త బెటరనిపించింది. పరుచూరి బ్రదర్స్ కానీ, అబ్బూరి రవి కానీ ఈ సినిమాని రక్షించలేకపోయారు.

Wednesday, May 18, 2011
న్యూస్: 'వీర' దర్శకుడి భాషా పరిజ్ఞానం!
రవితేజని రమేశ్‌వర్మ ఎలా కన్విన్స్ చేశాడోనని చాలామంది సినీ జీవులు ఆశ్చర్యపోతున్నారు. 'వీర' దర్శకుడు అతనే. అతనితో మాట్లాడిన వాళ్లకి కూడా అదే డౌట్ వస్తుంది. ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ కోసం రమేశ్‌వర్మని ఇంటర్వ్యూ (17-5-11 న వచ్చింది) చేసినప్పుడు అతని భాషా పరిజ్ఞానానికి ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. 'వీర' అంటే అతనో వివరణ ఇచ్చాడు. 'వీ' అంటే వినయంగా, 'ర' అంటే రాక్షసంగా అని అర్థమంట. అంటే మామూలుగా వినయంగా ఉండే హీరో అవసరమైతే రాక్షసంగా మారతాడంట. 'వీర' పాత్ర తీరు అదంట. నేనన్నాను... "మీరు చెపుతున్నది సరిగ్గా లేదు. టైటిల్లో మొదటి అక్షరం 'వీ'. అంటే 'వి'కి పొల్లు ఉంది. అలాంటప్పుడు 'వినయం' అనే పదం ఎలా సమన్వయిస్తుంది? అంతేకాదు. టైటిల్లో రెండో అక్షరం 'ర'. దానికి దీర్ఘం లేదు. కానీ మీరు 'రాక్షసం' అంటున్నారు. అదీ సింకవడం లేదు. అందువల్ల 'వీర'కి మీరు చెబుతున్నది సరైన అర్థం కాదు". అప్పుడతనన్నాడు. "దీర్ఘాలు, పొల్లులు లేకపోతేనేం సార్". అదీ సంగతి. దాన్ని బట్టి నాకర్థమైందేమంటే అతను మంచి 'స్టోరీటెల్లర్' అనీ, అందుకే రవితేజ పడిపోయాడనీ. లేకపోతే 'వీర' రిలీజ్ కాకముందే 'వాడే వీడు' అనే కథతో సినిమా చేయడానికి రమేశ్‌వర్మకి గ్రీన్‌సిగ్నల్ ఎందుకిస్తాడు?
Tuesday, May 17, 2011
కవిత: మగ్గం ఆడుతుంటే...
రోజంతా మగ్గం ఆడుతున్న చప్పుడు వింటాను
ఆ బక్కపలుచని చెక్కల నిర్మాణం ఎంత సుందరం!
నిలువుగా రెండు.. అడ్డంగా రెండు..
ఉక్కు కండల చేతులూ కాళ్లలా.. చెక్కలు!!
ఒక చేత్తో పలక, ఇంతో చేత్తో పిడి..
మగ్గంలో కూర్చున్న నాన్నని అపురూపంగా చూస్తుంటాను
లయబద్ధంగా నాట్యం చేస్తున్న నటరాజే జ్ఞాపకమొస్తాడు
పోగు పక్కన ఇంకో పోగు - పడుగు
పోగు మీద ఇంకో పోగు - పేక
సొరుగుల్లోంచి చకచకా అట్నించి ఇటు తిరిగే నాడి
వడివడిగా దూసుకొచ్చే జలతారు పోగులు
ఒక పావుచెక్క కిందికి దిగితే
ఇంకో పావుచెక్క పైకి లేస్తుంది
అచ్చులో సగం పోగులు కిందికీ
ఇంకో సగం పోగులు పైకీ
పోగులు చిక్కుబడకుండా
కచ్చిబద్దలు కాపలా కాస్తుంటాయి సైనికుల్లాగా
బట్ట బిగువు సడలిపోకుండా
చేళ్లు చేతులు చాపి పట్టుకుంటాయి రక్షకుల్లాగా
బుటా తర్వాత ఇంకో జరీ బుటా
సెల్ఫు తర్వాత ఇంకో పూల సెల్ఫు
పడుగు పైన పట్టు పాగళ్లు
గుడ్డమీద రంగుల సీతాకోకలవుతుంటాయి
నెమ్మదిగా చీకటి చిక్కనవుతుంటే
కిరసనాయిలు బుడ్డీలు
మగ్గం రెండుపక్కలా వెలుగుతాయి
మగ్గం చప్పుడు ఆగదు
పడుగు-పేక పరిమళాలు వదలవు
పదకొండు కొట్టేదాకా మగ్గం విశ్రమించదు
ఒక దోనె ఖాళీ అవుతుంటే
ఇంకో దోనె నిండు కుండవుతుంటుంది
ఒక తాను పుట్టాక
ఇంకో తాను పురుడు పోసుకోవడం మొదలవుతుంది!
టకటకమనే పలక చప్పుడులో
చెమట చుక్కల పాట సమ్మగా వినిపిస్తుంటుంది!!
-ఆంధ్రజ్యోతి 'వివిధ', 4 అక్టోబర్ 2010

ఫోకస్: రజనీకాంత్ 'రాణా' వెలుగు చూస్తుందా?
ఇప్పుడు అందరి చూపూ రజనీకాంత్ సినిమా 'రాణా' మీదే. ఆ సినిమా అసలు షూటింగ్ జరుపుకుంటుందా? లేక ఆగిపోతుందా? అనే ప్రశ్నలు అందరి మనసుల్నీ తొలుస్తున్నాయి. ఏప్రిల్లో ఈ మెగా బడ్జెట్ సినిమా సెట్స్ మీదకెళ్లింది. హీరోయిన్లుగా దీపికా పదుకోనే, ఇలియానా ఎంపికయ్యారు. నెల రోజుల వ్యవధిలో రజనీకాంత్ మూడు సార్లు హాస్పిటల్ పాలవడంతో సినిమా షెడ్యూలంతా డిస్టర్బయ్యింది. వాంతుల కారణంగా ఏప్రిల్ 29న ఆయన చెన్నైలోని సెయింట్ ఇసాబెల్ హాస్పిటల్లో చేరి, అదే రోజు సాయంత్రం డిశ్చార్జయ్యారు.
తిరిగి మే 4న జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో అదే హాస్పిటల్లోని ఐసీయూలో చేరారు. నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు ఆయనకు సూచించారు. దీంతో నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.
మరోవైపు హీరోయిన్లు దీపిక, ఇలియానా కాల్షీట్లు ఇరకాటంలో పడ్డాయి. ఈ నెలలో కొన్ని కాల్షీట్లు ఇచ్చిన దీపిక జూన్-జూలైలోనూ మరికొన్ని కాల్షీట్లు ఇచ్చింది. ఈలోగా రజనీకాంత్ కోలుకుని మళ్లీ షూటింగ్‌కి హాజరైతే ఓకే. లేదంటే ఏంచేయాలోనని అంతా తలల పట్టుకుంటున్నారు. మరోవైపు 'రాణా' షూటింగ్ యధాతథంగా జరుగుతుందని డైరెక్టర్ కేయస్ రవికుమార్ చెబుతున్నాడు. 'రాణా' టైటిల్ మార్పు కోసం ఆయన న్యూమరాలజిస్టుల్ని సంప్రదించాడు. థాయిలాండ్, లండన్‌లలో షూటింగ్ కోసం ఆయన షెడ్యూల్స్ వేయడంలో మునిగిపోయాడు.
ఈ సినిమా కోసం ఈరోజ్ సంస్థ 150 కోట్లని కేటాయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఆగితే ఏంచెయ్యాలనేది దాని ముందున్న సవాలు. మరి 'రాణా' ముందుకు కదులుతాడా? రజనీకాంత్ కోలుకుని ఎప్పడు షూటింగులో పాల్గొంటాడో...

Monday, May 16, 2011
న్యూస్: 'చరణ్-అర్జున్' గురించి రాయకండి
ఈరోజు ఆంధ్రజ్యోతిలో 'చరణ్, అర్జున్ కాంబినేషన్' అంటూ ఓ న్యూస్ వచ్చింది. రెండు రోజుల క్రితం 'ఈనాడు'లో దీనికి సంబంధించి ఓ న్యూస్ వేశారు. అందులో రాంచరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో గంటా శ్రీనివాస రావు (పీఆర్పీ ఎమ్మెల్యే) సినిమా తీయబోతున్నాడని రాశారు. దాంతో దిల్ రాజు పీఆర్వో కాల్ చేసి ఈనాడు వాళ్లు ఒక్క నిర్మాత పేరే రాశారనీ, దిల్ రాజు కూడా మరో నిర్మాతనీ చెప్పి, ఆయన చెప్పినట్లుగా కాకుండా మాకు తెలిసిందన్నట్లు రాయమన్నాడు. మేం ఓ రోజు గ్యాప్ తీసుకుని ఆ న్యూస్ కేరీ చేశాం. అదనంగా వచ్చే ఆగస్టులో అది మొదలవుతుందన్నాం. పోయినేడాదే గీతా ఆర్ట్స్ బేనర్ 'చరణ్-అర్జున్' అనే టైటిల్ రిజిస్టర్ చేసిన సంగతీ తెలిపాం. ఈ రోజు ఆ న్యూస్ వచ్చాక గీతా ఆర్ట్స్ పీఆర్వో నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. తాము చెప్పేదాకా 'చరణ్-అర్జున్' సినిమా గురించి ఏమీ రాయవద్దనీ, దయచేసి సహకరించమనీ దాని సారాంశం.
Saturday, May 7, 2011
ఫ్లాష్‌బ్యాక్: పద్మిని వివాహం
ఒకప్పటి అందాల తార, మలయాళ నాట్యతార పద్మిని వివాహం ఎలా జరిగిందో తెలుసా?
ఆమెకీ, డాక్టర్ కె. రామచంద్రన్‌కీ 1961 మే 25న కాలికట్ సమీపాన ఉన్న గురువాయూర్ ఆలయంలో నాయర్ కులాచార ప్రకారం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు పద్మిని పసుపుపచ్చ పట్టుచీర ధరిస్తే, వరుడు రామచంద్రన్ జరీ ధోవతి ధరించారు. తాళి కట్టిన తర్వాత వరుడు, వధువు ఒకరి మెడలో ఒకరు పుష్పమాలలు వేసుకున్నారు. పెళ్లి తతంగం కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. కొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే వివాహానికి వచ్చారు. అనేక గ్రామాల నుంచి వచ్చిన 20 వేల మంది ప్రజలు ఆలయం బయట చేరారు. వివాహ సమయంలో వర్షం పడింది. అయినా జనం కదల్లేదు. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎ.ఎల్. శ్రీనివాసన్, నటి టి.ఎ. మధురం, గాయని ఎం.ఎల్. వసంతకుమారి, కొందరు పెద్దలు, 200 మంది బంధువులు హాజరయ్యారు.
వధూవరులు మే 29న మద్రాసు తిరిగి వచ్చారు. మైలాపూర్‌లోని ఇలియట్స్ రోడ్డులో ఉన్న పద్మిని భవనం ముందు పెద్ద పెద్ద గుంపులుగా జనం చేరారు. 29, 30 తేదీల్లో పగలల్లా జనం అక్కడే ఉన్నారు. ఆ రెండు రోజుల్లో ఇంట్లో బంధు మిత్రులకు విందు సత్కారాలు జరిగాయి. భిక్షగాళ్లకు దానాలిచ్చారు. 30 రాత్రి మౌంట్ రోడ్డులోని అబట్స్‌బరీలో గొప్ప విందు జరిగింది. దాదాపు ఆరు వేల మంది ఈ విందుకు హాజరయ్యారు.

Friday, May 6, 2011
మన దర్శకులు: ఎన్. జగన్నాథ్
రఘుపతి వెంకయ్య కుమారుడైన ఆర్.ఎస్. ప్రకాశ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు ఎన్. జగన్నాథ్. 1936లో రూపొందిన 'ద్రౌపదీ మానసంరక్షణ' చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఆ సినిమా ఆడక పోవడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక వనరులు సమకూర్చుకుని స్వీయ దర్శకత్వంలో 'తారుమారు', 'భలేపెళ్లి' చిత్రాల్ని నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ పరబ్రహ్మశ్రీ, హేమలత, డా. శివరామకృష్ణయ్య నటించారు. ఈ రెండూ ఆర్థికంగా విఫలమయ్యాయి. వీటిలో 'భలేపెళ్లి' తో సంభాషణల రచయితగా పింగళి నాగేంద్రరావు చిత్రసీమకు పరిచయమయ్యారు. తెలుగులో ఫ్లాపులు ఎదురవడంతో తమిళ, హిందీ భాషల్లో 'విశ్వామిత్ర' చిత్రాన్ని తీశారు.
ఆ తర్వాత చాలా కాలానికి ఆయనకు తెలుగులో 'శ్రీకృష్ణ రాయబారం' రూపొందించే అవకాశం వచ్చింది. వై.వి. రామానుజం, బి.వి. కృష్ణమూర్తి, డా. నరసింహాచార్లు నిర్మించిన ఈ సినిమా 1960 ఫిబ్రవరి 19న విడుదలై అపజయాన్ని పొందింది. ఈ సినిమాలో రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, కాంతారావు, గుమ్మడి, సంధ్య, రాజనాల, కె.వి.ఎస్. శర్మ, హేమలత, రుష్యేంద్రమణి, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని వంటి మహామహులు నటించారు. ఈ సినిమాకి జగన్నాథ్ వద్ద అప్రెంటిస్‌గా పనిచేసిన పి. చంద్రశేఖరరెడ్డి అనంతర కాలంలో దర్శకునిగా గొప్పగా రాణించారు. జగన్నాథ్ సతీమణి కల్యాణ సుందరి రాసిన కథతో రూపొందించిన 'కొత్త కాపురం'తో గురుదక్షిణ చెల్లించారు చంద్రశేఖరరెడ్డి.

Monday, May 2, 2011
రోజారమణికి రాష్ట్రపతి ప్రశంస
'భక్త ప్రహ్లాద'ను అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చూపించేందుకు ప్రివ్యూ ఏర్పాటు చేశారు ఏవీయం చెట్టియార్. పెద్ద సినిమా కావడంతో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఆ సినిమా చూసేందుకు రాధాకృష్ణన్ సరేనన్నారు. తొలి సగం చూశాక 'ప్రహ్లాదుడిగా చేసిన బాబు ఎవరు?' అనడిగారు. 'బాబు కాదు పాప' అని ఏవీయం వాళ్లు చెప్పాక, ఆశ్చర్యపోయిన ఆయన 'ఆ పాపను రప్పించండి' అని చెప్పారు. రోజారమణి తల్లి అప్పుడు ప్రెగ్నంట్ కావడంతో కూతుర్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు సత్యం. రోజారమణిని తన పక్కనే కూర్చుండ పెట్టుకుని, సినిమా సెకండాఫ్ చూశారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి భవన్‌లో భోజనం పెట్టించారు. ప్రహ్లాదుడిగా నటించినందుకు ఒక ప్రశంసాపత్రం ఇచ్చారు. అదే పాత్రకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ బాలనటి అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా అందుకుంది బాల రోజారమణి.
రోజారమణి తొలి సినిమా అనుభవం
ప్రఖ్యాత ఏవీయం ప్రొడక్షన్స్ సంస్థ 1967లో 'భక్త ప్రహ్లాద'ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా రోజారమణి బాల నటిగా తెరంగేట్రం చేశారు. ఆమె ఆ పాత్రకు ఎంపికవడం ఓ మిరకిల్. అప్పటికి ఆమె ఇంకా స్కూల్లో చేరలేదు. ఒకసారి మద్రాసులో ఏవీయం స్టూడియో చూపించేందుకని వాళ్ల నాన్న సత్యం ఆమెని అక్కడికి తీసుకుపోయారు. ఆయన ఆ రోజుల్లో 'సినిమా రంగం' అనే సినీ పక్ష పత్రికకి మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసేవారు. అప్పుడు పరిస్థితి ఎలా వుందంటే స్టూడియో వద్ద ఎవరైనా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు, ప్రహ్లాదుని పాత్రకు సరిపోతారా, లేదా అని చూస్తున్నారు. "ఆ స్టూడియో ఇంచార్జి నాగేశ్వరరావు అనే ఆయనకు నాన్న బాగా తెలుసు. ఆయన నన్ను చూసి ముచ్చటపడి రంగూన్ రామారావు అనే కో-డైరెక్టర్‌ని పిలిపించి, నన్ను ఆ పాత్రకు సరిపోతానో, లేదో చూడమన్నారు. ఆయన 'ఆడపిల్ల కదా' అని సందేహపడ్డారు. మేకప్ వేస్తే ఆ సంగతి కనిపెట్టడం కష్టమని నాగేశ్వరరావు అనడంతో నాకు చేతనైంది ఏమైనా చేయమని రామారావు అడిగారు. అప్పట్లో నాకు వచ్చింది 'మూగ మనసులు' సినిమాలోని 'గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది' పాటే. ఆ పాటకు డాన్స్ చేసి చూపించా. సరేనని ఆయన ఒక శ్లోకం చెప్పి, దాన్ని అలాగే చెప్పమన్నారు. నేను ఏమీ ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు 'శుక్రవారం చెబుతా' అని చెప్పా. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏవీయం నుంచి నాకోసం కారు వచ్చింది. అప్పటికే నాన్నగారు ఆఫీసుకు వెళ్లిపోయారు. అమ్మ, నేను కారులో నాన్న ఆఫీసుకు వెళ్లాం. అక్కణ్ణించి అందరం స్టూడియోకు వెళ్లాం. ఫ్రాకులో ఉన్న నన్ను ఫోటోలు తీశారు. వాటిని చెట్టియార్ గారి వద్దకు పంపించారు. 'ఇదేమిటి ఆడపిల్ల ఫోటోలు పంపారు?' అని అబ్బాయి డ్రస్సులో ఫోటోలు తీయమని కో-డైరెక్టర్ రామారావుకు చెప్పారు. అప్పడు నా జుట్టును బాయ్‌కట్ చేసి, నాకు బాబా సూట్ వేసి ఫోటోలు తీశారు. ఫోటోలో నేను చెట్టియార్ గారికి నచ్చాను. అయితే ప్రహ్లాదుడిగా నేను నప్పుతానో, లేదోననే సందేహం వచ్చి, ఈసారి రాజకుమారుడి డ్రస్సులో ఫోటోలు పంపమన్నారు. నాకు మళ్లీ రాజకుమారుడి డ్రస్సు, విగ్గు, మేకప్‌తో ఫోటోలు తీశారు. అప్పుడూ చెట్టియార్ గారికి నచ్చా. కానీ అంతటితో పరీక్షలు పూర్తవలేదు. ప్రహ్లాదునికి పాములు, ఏనుగులతో సన్నివేశాలున్నాయి కాబట్టి, పాముతో నేను సన్నివేశం చేయగలనా, లేదా అనే సందేహం వాళ్లకి వచ్చింది. పాము తెప్పించారు. నా మెడలో వేశారు. నేను భయపడకుండా దాన్ని పట్టుకున్నా. ఆ పాము సన్నివేశాన్ని రామారావు గారు కెమెరాతో షూట్ చేయించారు. అది చూపించాక 'ప్రహ్లాదుడు దొరికాడు' అన్నారు చెట్టియార్. ఆ పాత్ర కోసం నెల రోజులపాటు నాచేత ప్రాక్టీస్ చేయించారు. మొట్టమొదట క్లైమాక్స్ సీన్ తీశారు" అని చెప్పుకొచ్చారు రోజారమణి.
Subscribe to:
Posts (Atom)