Friday, June 25, 2010
Telugu Cinema Quiz-1
1. అనుష్క టైటిల్ రోల్ చేసిన 'పంచాక్షరి' దర్శకుడు ఎవరు?
2. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసి' ఆధారంగా వచ్చిన సినిమా?
3. 'బావ నచ్చాడు'లో నాగార్జున భార్య సిమ్రాన్, మరి మరదలు?
4. సుమన్, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌తో బోయిన సుబ్బారావు డైరెక్ట్ చేయగా 1985లో వచ్చిన ఫిల్మ్?
5. 'నా పాట పంచామృతం' పాట ఏ మూవీలోనిది?
6. శొభన్‌బాబు, మంజుల జంటగా నటించిన 'గడుసు పిల్లోడు' డైరెక్టర్?
7. 'వయ్యారి భామలు వగలమారి భర్తలు'లో ఎన్‌టీఆర్, కృష్ణ తల్లి?
8. 'బంపర పనస పండురో' పాట కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఏ సినిమాలోనిది?
9. '20వ శతాబ్దం'లో హీరో?
10. వెంకటేశ్, భానుప్రియ, గౌతమి కాంబినేషన్‌లో వచ్చిన ఫిల్మ్ నిర్మాత?
11. రవితేజ, కల్యాణి జంటగా భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన సినిమా?
జవాబులు:
1. వి. సముద్ర
2. కాష్మోరా
3. రీమాసేన్
4. ముసుగు దొంగ
5. అల్లరి మొగుడు
6. కె. బాపయ్య
7. పండరీబాయి
8. ఘరానా దొంగ
9. సుమన్
10. కె. మురారి
11. దొంగోడు
Thursday, June 24, 2010
Wednesday, June 23, 2010
Dasari Narayana Rao on success rate of films

ఈమధ్య నేను చేసిన ఇంటర్వ్యూలో దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పిన రెండు ఇంటరెస్టింగ్ పాయింట్స్ మీకోసం..
*సినిమాల సక్సెస్ రేటు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు థియేటర్లు లీజుకు తీసుకుని రూపాయికి ఇంకో రూపాయి లాభం వేసుకుని రెంటు వసూలు చేస్తూ నిర్మాతల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇంతకుముందు పెద్ద హీరోల సినిమా విడుదలైన రెండు వారాల పాటు టిక్కెట్ రేటు పెంచితే దాని వల్ల లాభం జరుగుతుందని అనుకుని ఆ పద్ధతికి మద్దతు పలికారు. తెలియక వారు చేసిన ఈ పని వల్ల థియేటర్ల రెంట్లు పెరిగాయి. రెంటల్ సిస్టం వల్ల ఎన్నో మంచి సినిమాలు నాశనం అవుతున్నాయి. పర్సంటేజ్ విధానం అమలు చేసే విషయంలో ప్రతిసారీ మోసం జరుగుతోంది. ఇప్పుడు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
*మొదటి నుంచి నా నినాదం ఒక్కటే. దర్శకుడిదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలి. దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్న ఈనాటి దర్శకుల్ని చూసి నేను గర్వపడుతున్నా. పెద్ద హీరోలు సైతం దర్శకుడి మీద ఆధారపడేలా చేసిన ఇప్పటి టాప్ డైరెక్టర్లను అభినందిస్తున్నా. అయితే ఒక విషయం. ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తేనే సినిమా బాగా వస్తుందనే అభిప్రాయాన్ని మార్చుకోండి. ఆ రోజుల్లో మేం 40 రోజుల్లో తీసిన సినిమాని మీరు 80 రోజుల్లో తియ్యండి. అంతేకానీ 250 రోజులు తీసి నిర్మాతని ఇబ్బంది పెట్టకండి. నిర్మాణ వ్యయం తగ్గించడం దర్శకుల చేతుల్లో ఉన్న పని. విమర్శిస్తున్నానని అనుకోకుండా ఆత్మావలోకనం చేసుకుని సినిమాల సక్సెస్ రేటు పెంచమని చెబుతున్నా.
Tuesday, June 22, 2010
Monday, June 21, 2010
Kota Srinivasa Rao's son Prasad dead in road accident

కోట శ్రీనివాసరావుకు విషాదం మిగిల్చిన ఫాదర్స్‌డే
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు ఫాదర్స్‌డే తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరు కొడుకులు ఫాదర్స్‌డే జరుపుకుంటుంటే కోట మాత్రం పుట్టెడు పుత్రశొకంలో మునిగిపొయ్యారు. ఆయన కుమారుడు ప్రసాద్ ఆదివారం (జూన్ 20) హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యాపిల్లల్ని కారులో రమ్మని చెప్పి ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త స్పోర్ట్స్ బైక్‌పై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్‌కు లంచ్ చేసే నిమిత్తం వెళ్తున్న ఆయనను లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కోటకు ప్రసాద్ ఒక్కరే కొడుకు కాగా ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రసాద్ ఇప్పటివరకు రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడొ చిత్రం 'గాయం-2'లో నటిస్తున్నారు. జగపతిబాబు హీరోగా జె.డి. చక్రవర్తి డైరెక్ట్ చేసిన 'సిద్ధం' సినిమాలో సలీం అనే నెగటివ్ పాత్రతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రసాది. ఆ పాత్ర పోషణతో ఆయన ప్రేక్షకుల అభినందనలే కాక విమర్శకుల ప్రశంసలూ చూరగొన్నారు. నిజానికి ఆయన మొదట ముఖానికి రంగేసుకున్నది 'వీడు వాడు ఇంకొకడు' అనే సినిమాకి. సీనియర్ రచయిత దివాకర్‌బాబు కుమారుడు శ్రీకర్‌బాబు నటించి, రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు వెలుగు చూడలేదు.
'గాయం-2'లో నిజ జీవిత పాత్రల్నే కోట శ్రీనివసరావు, ప్రసాద్ పోషిస్తుండటం గమనార్హం. ఇందులోనూ హీరో జగపతిబాబే. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొడుకు పాత్ర చనిపోతుంది. ఆ సందర్భంగా వచ్చే కొడుకు భౌతికకాయానికి తలకొరివి పెట్టే సన్నివేశాన్ని చేయడానికి కోట నిరాకరించారు. దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని తీసినట్లు తెలిసింది. అయితే సినిమాలో ఆ సన్నివేశాన్ని అభినయించడాన్ని తప్పించుకున్న కోట నిజ జీవితంలో మాత్రం ఆ సన్నివేసం నుంచి తప్పించుకోలేకపోవడం విషాదంలో విషాదం. దుర్ఘటన జరిగినప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన ఆస్పత్రిలో కుమారుడి పార్థివ శరీరాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక ఫిలింనగర్‌లోని ఆయన ఇల్లయితే శోకసంద్రంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమతో కోటకు ఉన్న అనుబంధం వల్ల ఆయనకు హితులు, స్నేహితులు, సన్నిహితులు లెక్కకు మించి ఉన్నారు. వారంతా కోట కుమారుడి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక సినిమాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబూమోహన్ సాయంత్రం నుంచి రాత్రివరకు కోటని ఓదారుస్తూ ఆయనని అంటిపెట్టుకునే ఉన్నారు. కోటను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపినవారిలో ఎం. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సిహెచ్. విద్యాసాగరరావు, జె. కిషన్‌రెడ్డి వంటి బీజీపీ నాయకులు; చిరంజీవి, రామానాయుడు, అల్లు అరవింద్, సురేశ్‌బాబు, వెంకటేశ్, పవన్ కల్యాణ్, త్రిపురనేని మహారథి, పరుచూరి బ్రదర్స్, జగపతిబాబు, శ్రీహరి, శాంతి, కవిత, ఇ.వి.వి. సత్యనారాయన, రేలంగి నరసిమ్హారావు, చలపతిరావు, శివకృష్ణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, వివి వినాయక్, వీరశంకర్, చక్రపాణి, రోజారమణి, తరుణ్, రాజీవ్ కనకాల, ఆర్యన్ రాజేశ్, నరేశ్, రోహిత్, వరుణ్ సందేశ్ తదితర చిత్రసీమ ప్రముఖులున్నారు. ప్రసాద్, తను దాదాపు సోదరుల్లాగా మెలగుతుంటామనీ, 'సిద్ధం'తోనే తామిద్దరికీ బ్రేక్ వచ్చిందనీ, ఆయన మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ ప్రసాద్‌తో సన్నిహితంగా మెలగే నటుడు, అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ భరత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భర్త మరణవార్త తెలియగానే భార్య మోనా స్పృహతప్పి పడిపోయారు. రాత్రివరకు ఆమె ఆ స్థిలోనే ఉన్నారు. ప్రసాద్ మృతదేహాన్ని రాత్రి నింస్ ఆస్పత్రిలో ఉంచారు. సోమవారం ఉదయాన్నే భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించి, ఆ తర్వాత అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Memories of Ramanaidu
అప్పుడప్పుడు రామానయుడు గారితో ఆయన అఫీసులో కలిసి కూర్చొని సినిమా సంగతులు మాట్లాడుతుండటం మాకు అలవాటు. ఈమధ్య అలాగే కూర్చున్నప్పుడు తన తొలినాటి సినిమా సంగతులు చెప్పుకొచ్చారు. వాటిలోని ఒకట్రెండు ఇంటరెస్టింగ్ పాయింట్స్.
*నేను సినిమా తియ్యాలని మద్రాసు వెళ్లినప్పటికీ, ఇప్పటికీ చిత్రసీమలో ఎంతో మార్పు వచ్చింది. మొదటిసారి కొందరు మిత్రులతో కలిసి ఒక సినిమా తీశా. పెట్టుబడి ఎంతో తెలుసా? 20 వేలు. మీకో విషయం తెలుసా? నేను కూడా హీరో అవ్వాలనుకున్నా.
*మద్రాసు వెళ్ళిన కొత్తలో మా బావగారితో కలిసి జగ్గయ్య వద్దకు వెళ్లా. అప్పట్లో ఆయన చాలా పెద్ద హీరో. 'సినిమాల్లో చేరాలని ఉందండి' అని చెప్పా. 'మీరు చూసిన సినిమాలో ఒక సీన్ తీసుకోండి. అద్దం ముందు యాక్ట్ చెయ్యండి. ఇలా చేసి అనుభవం గడించి, ఏడాది తర్వాత రండి' అన్నారాయన. అంతకాలం ఏం ఆగుతాం? ప్రొడక్షన్ వైపు దిగా. అయితే శాంతకుమారి-నాకు తల్లిలాంటిది- 'నువ్వు హీరోలా ఉంటావురా. యాక్ట్ చెయ్యొచ్చు కదరా. హీరోయిన్లు అందరూ నిన్నే చూస్తున్నారు. రామారావు తప్పితే నీకన్నా అందగాడు ఎవరున్నారురా' అనేది. ఆవిడ కోసం ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేషం వేస్తూ ఉండేవాణ్ణి.
*నాకు శివాజీ గణేశన్, కమల్ హాసన్ బాగా ఇష్టమైన నటులు. శివాజీతో నేను 'వసంతమళై' అనే తమిళ్ సినిమా తీశా. పెద్ద హిట్ అది. ఈ సినిమాతో నాకు ఎంత పేరు వచ్చిందంటే.. మొన్న ఒకసారి మద్రాసు వెళ్లినప్పుడు 'వసంతమళై' తీసిన రామానాయుడేనా అని కొందరు పలకరించారు. నాకు చాలా ఆనందం వేసింది.

Saturday, June 19, 2010
Ninna 'Gamyam'.. Nedu 'Vedam'
మూసలోపడి కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి అప్పుడప్పుడు ఎవరో ఒక దర్శకుడు రేపటి మీద ఆశని రేకెత్తిస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల, సాయికిరణ్ అడివి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) వంటి దర్శకులు సృజనాత్మకపరంగా తెలుగు సినిమాని ఓ మెట్టుపైకి తీసుకెడతారనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 'మినిమం గ్యారంటీ' ఉచ్చులో పడకుండా మన సినిమాల్లో చెప్పని కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 'గమ్యం' సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జీవితంలోని వెలుగునీడల్ని, జీవిత సారాంశాన్ని ఇంత అందంగా తియ్యగల దర్శకులు తెలుగులో ఉన్నారా! అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం. ఆవారాగా, ఆకతాయిగా తిరిగే గాలి శీను తనకు ఎదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా ఆఖరుకి త్యాగమూర్తిగా మిగిలాడో చూసి, కళ్లతో పాటు గుండెనీ తడిచేసుకున్నాం. గాలి శీను కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యమవకుండానే ఇప్పుడు మరో కేబుల్ రాజు ఆ స్థానంలో వచ్చి నిల్చున్నాడు. 'వేదం'లో కేబుల్ రాజుని చూస్తే 'గమ్యం'లోని గాలి శీను జ్ఞాపకమొస్తాడు. ఆకతాయితనంలో గాలి శీనుని మించినవాడు కేబుల్ రాజు. డబ్బుకోసం ఎదుటివాళ్లని బోల్తాకొట్టించడంలో మొనగాడు. డబ్బున్న అమ్మాయి ప్రేమని పొంది, రంగుల కలల్లో విహరిస్తున్నవాడు. ఒకప్పుడు అందరూ ఈసడించుకున్నవాళ్లే, చీదరించుకున్నవాళ్లే చివరాఖరుకి అతడు చేసిన త్యాగానికి
కదిలిపోయి జేజేలు పలికారు. జీవన వాస్తవం అంటే అదే. 'గమ్యం'తో ఎంతగా ఆశ్చర్యపరిచాడో, 'వేదం'తో అంతగానూ అబ్బురపరిచాడు క్రిష్‌లోని డైరెక్టర్. 'గమ్యం'కి మూలం 'మోటార్ సైకిల్ డైరీస్' అన్నారు. 'వేదం'కి ప్రేరణ ఆరేళ్ల క్రితం ఆస్కార్ అవార్డులు పొందిన 'క్రాష్' అంటున్నారు. కావచ్చు. కాకపోవచ్చు. ఒకవేళ అది నిజమేననుకున్నా, ఎంతమంది దర్శకులు ఎన్ని సినిమాల్ని కాపీ కొట్టలేదు. కానీ తెలుగుతనానికి దగ్గరగా, అందంగా, ఆర్ద్రంగా వాటిని మలిచిందెంతమంది? ఆ కళేదో, ఆ విద్యేదో క్రిష్ నేర్చాడనుకోవాలి. తన సినిమాలు హాలీవుడ్ నుంచో, మరో వుడ్ నుంచో వండినవి కాదని అంటాడు క్రిష్. కావాలంటే తన కథల, తన పాత్రల మూలాలు నిజ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఉన్నాయంటాడు. 'వేదం'లో తను సృజించిన ఐదు ప్రధాన పాత్రలే కాక, మిగతా చిన్న చిన్న పాత్రలు కూడా మన కళ్లముందు కనిపించేవేనంటాడు.
'వేదం'అఓ ఐదు ప్రధాన పాత్రలూ ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవే కాదు, వాటి కథలూ భిన్నమైనవే. సంపన్న కుటుంబానికి చెందిన వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్) అనే రాక్‌స్టార్, మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకుడు రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్‌పేయి), దిగువ తరగతికి చెందిన కేబుల్ రాజు (అల్లు అర్జున్), పూట గడవడమే కష్టమైన చేనేత కార్మికుడు రాములు (నాగయ్య), సమాజమంతా ఈసడించుకునే, రాత్రి జీవితం మాత్రమే ఉండే వేశ్య అమలాపురం సరోజ (అనుష్క).. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వెత.
తల్లి సైనికుడిగా చూడాలనుకుంటే రాక్‌స్టార్ కావాలనుకున్న వివేక్ చక్రవర్తిలోని స్వార్థం అతణ్ణి ఏ పరిస్థితుల్లో నిలిపిందో, ఆ పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్న అతను చివరికి అమ్మ గర్వపడే స్థాయికి ఎలా చేరుకున్నాడో చూసి సంతృప్తిపడతాం. దైనందిన జీవితంలో కేబుల్ రాజు వంటి వ్యక్తులు తగలని వాళ్లం ఉండం. కానీ అలాంటివాళ్లు మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అందుకే రెబల్‌గా, చిలిపిగా, ఆకతాయిగా కనిపించే పక్కా మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుని మొదట కోపగించుకుంటాం. తర్వాత అతణ్ణి భుజాలమీద పెట్టుకుంటాం. "రాములు కథ అనుకున్నప్పుడు ఒక వృత్తి పనివాణ్ణిగా చూపించాలనుకున్నా. ఇటీవలి కాలంలో సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. కథకి రెలటివిటీగా ఉంటుందని రాములుని చేనేత కార్మికుడిగా చూపించా" అని చెప్పాడు క్రిష్. తనకు హైదరాబాద్‌లో ఎదుగుదల ఉండదనీ, అందుకని దుబాయ్ వెళ్లి సంపాదించి, మెరుగైన జీవనం గడపాలనుకునే రాహీముద్దీన్ ఖురేషి లాంటి మధ్యతరగతి జీవులు ఎక్కడ వెతికినా కనిపిస్తారు. అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర్ తిలక్ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉందంటాడు క్రిష్. ఒక వేశ్య అయినా పిల్లవాడికి పాలిచ్చే సరోజని చూసినప్పుడు ఎవరూ ఆమెలో శృంగారాన్ని చూడకపోవడం అతని దర్శకత్వ చాతుర్యానికి నిదర్శనం. ఈ పాత్రల్ని తెరమీద ధరించిన వాళ్లంతా వాటికి న్యాయం చేకూర్చడం వల్ల ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా కేబుల్ రాజుగా అల్లు అర్జున్, సరోజగా అనుష్క తమ నటనతో ఆ పాత్రలకి వన్నెతెచ్చారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వివేక్ చక్రవర్తి పాత్రలో మనోజ్ హావభావాలు ఒక పట్టాన మరచిపోలేం. అలాగే పటేల్ దగ్గరున్న మనవణ్ణి విడిపించుకుని, అతడి చేయి పట్టుకుని నడిపించుకువెళ్లే రాములులోని రేపటి మీద ఆశ మనల్ని కదిలిస్తుంది. క్రిష్ మనసులోని దృశ్యాలకి జ్ఞానశేఖర్ కెమెరా ఇచ్చిన తెరరూపం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. అతడికిది తొలి సినిమా అంటే నమ్మడం కష్టం. పాటల్లో కంటే కీరవాణి కీబోర్డు నేపథ్య సంగీతానికి బాగా ఉపకరించింది. ఆయా సన్నివేశాల్లోని మూడ్ ఎలివేట్ అయ్యింది ఆయన సంగీతం వల్లే. ఎడిటింగ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఐదు కథల్ని బిగి సడలకుండా, బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కూర్చడం కత్తిమీద సాము. ఆ పనిని శ్రావణ్ నైపుణ్యంగా చేసుకుపొయ్యాడు. మూస సినిమాల్నే ఇష్టపడే వాళ్ల సంగతేమో కానీ కమర్షియాలిటీని మిస్ కాకుండానే కొత్తదనం కురిసే సినిమాల్ని చూడాలనుకున్న వాళ్లకి 'వేదం' తొలకరి జల్లులాంటిదే.

Friday, June 18, 2010
Rana.. The Rising Actor
శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్'తో కథానాయకుడిగా పరిచయమైన రానా (రామానాయుడు) చిత్రమైన సమస్యని ఎదుర్కొంటున్నాడు. ఆయన పొడవాటి రూపమే ఆ సమస్య. దీనివల్ల ఆయనకి తగ్గ కథానాయకిని అన్వేషించడం కష్టమైపోతోంది. ఈ సంగతిని ఆయనే చెప్పాడు. వంద రోజులు నడిచిన తొలి సినిమా 'లీడర్'లో ఆయన సరసన రిచా గంగోపాధ్యాయ్ ప్రదాన నాయకిగా పర్వాలేదనిపించింది. రెండో నాయిక ప్రియా ఆనంద్ అయితే మరీ పొట్టిగా కనిపించింది. అందువల్లే ఇప్పుడు తెలుగులో రెండో సినిమాకి నాయిక ఎంపిక కోసం కషపడుతున్నారు. ఈ రెండో సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు. రానా బాబాయ్ వెంకటేశ్ కథానాయకుడిగా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాన్ని రూపొందించిన శ్రీరాఘవ. "ఇది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుంది. ఐదు వేల సంవత్సరాల క్రితం నేపథ్యంలో జరిగే కాల్పనిక కథ అది. తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా ఉంటుంది. ఇది కొత్త తరహాలో ఉంటుందని చెప్పగలను. తెలుగు సంభాషణలు కూడా రెగ్యులర్ సినిమాల్లో మాదిరిగా ఉండవు. అడవిలో ఎక్కువ షూటింగ్ ఉంటుంది" అని చెప్పాడు రానా. హీరోయిన్ ఎంపిక జరిగితే ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం రానా హిందీలో 'దం మారో దం' చేస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, ప్రతీక్ బబ్బర్ (రాజ్ బబ్బర్ కొడుకు)తో కలిసి నటిస్తున్నాడు. విశేషమేమంటే ఈ చిత్రంలో అతనికి జోడీగా బిపాషా బసు నటిస్తోంది. తెలుగులో గతంలో మహేశ్ సరసన 'టక్కరి దొంగ'లో కనిపించిన బిపాషా బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ కిందే లెక్క. అలాంటిది అక్కడ తొలి సినిమాలోనే బిపాషాతో జతకట్టే అవకాశం దక్కింది రానాకి. ఈ సినిమాకి రోహన్ సిప్పీ దర్శకుడు. గోవా నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా తయారవుతోంది.
తెలుగులో 'లీడర్' తర్వాత వెంటనే సినిమా ప్రారంభించకుండా ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు? "నా తొలి సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఒక ప్రయోగంగా చేసిన ఆ సినిమాని ప్రేక్షకులు మెచ్చడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ప్రత్యామ్నాయ సినిమాలు చేయొచ్చా, లేదా అని తెలుసుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నా. ఒక ప్రధాన స్రవంతి కథకు ప్రత్యామ్నాయ ట్రీట్మెంట్ ఇచ్చి చేసిన సినిమా 'లీడర్'. రోజువారీ అందరూ ఎదుర్కొనే సమస్యల్ని చూపించిన సినిమా. దాని ఫలితంతో పూర్తి స్థాయిలో నేను సంతృప్తి చెందా. ఈ తరహా సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని అది కలిగించింది" అని వివరించాడు రానా. ఆయనలో కేవలం నటుడే కాదు రచయిత కూడా ఉన్నాడు. స్వయంగా కొన్ని కథలు రాసుకున్నాడు కూడా. ఒక కథ తాలూకు పూర్తి స్క్రిప్టు ఆయా వద్ద సిద్ధంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఆ కథతో సినిమా చేసే అవకాశముందని ఆయన చెప్పాడు.

Wednesday, June 16, 2010
Future awaits for 'Jessie'
యువతని "జెస్సీ తెలుసా?" అని అడిగి చూడండి. "ఎందుకు తెలీదు. అందుకే కదా కార్తీక్ (నాగచైతన్య) 'ఏమాయ చేసావె' అన్నాడు" అంటారు ఠక్కున. అంతలా జెస్సీ పాత్రతో ఆకట్టుకుంది, అలరించింది మృదుమధురంగా కనిపించే సమంత. అక్కినేని నాగేశ్వరరావు అంతటాయన్ని కూడా తన అభినయంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ హీరోల సినిమాల్లో ఎంపికవుతూ, తోటి తారలకు అసూయ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఎన్‌టీఆర్ సరసన రెండో నాయికగా 'బృందావనం'లో నటిస్తున్న ఆమె మరో రెండు పెద్ద సినిమాల్లో నాయికగా ఎంపికైంది. వాటిలో మొదటిది అగ్ర కథానాయకుడు మహేశ్ సరసన కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అలాగే 'బొమ్మరిల్లు' హీరో సిద్ధార్థ్‌తో దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలోనూ ఆమె నాయికగా ఎంపికైంది. వేణు శ్రీరాం అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు. ఇలా క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు పొందుతున్న సమంత పూర్వీకులు తెలుగువాళ్లే అయినా తల్లి మలయాళీ కావడం, పుట్టిందీ, పెరిగిందీ చెన్నైలో కావడం వల్ల తెలుగు తెలీకుండా పెరిగింది. చెన్నైలోని స్టేరీ మెల్లా కాలేజీలో బీకాం చదివేప్పుడు ఆమెకి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఓ తమిళ సినిమాలోనూ నాయికగా ఎంపికై, డైరెక్టర్ గౌతం మీనన్ దృష్టిలో పడింది. మొదట సినిమాల్లో చెయ్యడానికి వెనుకాడి, చివరికి 'ఏమాయ చేసావె'తో పరిచయమయ్యింది. దాంతో ఆమె దశే తిరిగింది. రాత్రికి రాత్రే యువతరం ఆరాధ్య తారగా మారింది. అందుకు తగ్గట్లుగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో భవిష్యత్ టాప్ హీరోయిన్ ఆమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక కాజల్ అగర్వాల్ జాగ్రత్తగా ఉండాల్సిందే!
Subscribe to:
Posts (Atom)