Saturday, August 17, 2013
కాంచనమాల మొదటి చిత్రం
'శ్రీకృష్ణ తులాభారం' (1935)లో ఒక అప్రధాన పాత్ర చేసిన కాంచనమాలకు హీరోయిన్‌గా మొదటి చిత్రం 'వీరాభిమన్యు' (1936). సాగర్ మూవీటోన్ పతాకంపై డాక్టర్ అంబాలాల్ ఎం. పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీన్ దర్శకుడు. ఇది సాగర్ వాళ్లు 'వీరాభిమన్యు' పేరుతోటే హిందీలో తీసిన సినిమాకు రీమేక్. అభిమన్యునిగా పులిపాటి వెంకటేశ్వర్లు, ఉత్తరగా కాంచనమాల నటించగా, కీలకమైన సుభద్ర పాత్రను సురభి కమలాబాయి అద్భుతంగా పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ను ఉత్తర గర్భాదానం సన్నివేశంతో ప్రారంభించారు. తొలిరోజే కాంచనమాల తనకిచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకోనని మొండికేసింది. ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు. ఆమె కోసం డ్రస్సులో కొద్ది మార్పులు చేశారు. కాని ఈ సీనులే కొంత కాలానికి రీషూట్ చేయాల్సి వచ్చినప్పుడు తాను మొదట వద్దన్న డ్రస్సు వేసుకోడానికి కాంచమాల ఒప్పుకుంది. ఆ డ్రస్సులో ఆనాడు కానమాల కనిపించినంత అందంగా తెలుగు తెర మీద చాలా కాలం వరకూ మరో తార కనిపించలేదని చెప్పుకునే వాళ్లు. సాగర్ మూవీటోన్ స్టూడియోలో ఆమె చాలా మంచి ఇంప్రెషన్ కలిగించింది. సెట్టు మీద ఆమె శరీరం వంచి కష్టపడేది. అందుచేత టెక్నీషియన్లు ఆమె మీద చాలా అభిమానంగా ఉండేవాళ్లు. మెహబూబ్ ఆమెకు హిందీ నేర్పి తన చిత్రాల్లో నటింప చేస్తానని అడిగాడు. కాంచనమాల ఒప్పుకుంటే తెలుగు సినిమా ఒక గొప్ప అందాల తారను మిస్సయ్యేది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment