Saturday, March 23, 2013
రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' ఏమైంది?
తమిళ డైరెక్టర్ టి. రాజేందర్ అంటే మనకి మొదట గుర్తొచ్చే సినిమా 'ప్రేమ సాగరం'. తెలుగులో అది యేడాది పైగా ఆడింది. ఇప్పుడు ఆయన నేరుగా తెలుగులో 'ప్రేమదాసు' అనే సినిమా తీస్తున్నారు. టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు. గతంలోనే ఆయన తెలుగులో ఓ సినిమా ప్రారంభించారు కానీ మధ్యలోనే ఆపేశారు. అందులో హీరో ఎవరో తెలుసా? కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు. ఆ సినిమా పేరు 'ప్రేమ చరిత్ర'. పాతికేళ్ల క్రితం... అంటే 1988 మార్చి 14న మద్రాస్ బొటానికల్ గార్డెన్స్‌లొ షూటింగ్ మొదలైంది. రమేశ్‌బాబు సరసన శ్రీభారతి అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇది మామూలు ప్రేమకథ కాదనీ, అసాధారణ ప్రేమకథనీ రాజేందర్ చెప్పారు. మాటల రచయితగా మహారథినీ, పాటల రచయితగా సీతారామశాస్త్రినీ తీసుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం, దర్శకత్వాల్ని రాజేందర్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. సుధాలయా పిక్చర్స్ బేనర్‌పై శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు ఈ సినిమా నిర్మాతలు. కానీ తర్వాత ఈ సినిమా షూటింగ్ అటకెక్కింది. రమేశ్‌బాబు 'ప్రేమ చరిత్ర' వెలుగు చూడలేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment