Friday, September 9, 2011

ప్రివ్యూ: దేవరాయ

శ్రీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా 'దేవరాయ'. సోషియో ఫాంటసీగా తయారవుతున్న ఈ సినిమాలో దొరబాబుగా, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్ని శ్రీకాంత్ చేస్తున్నారు. కిరణ్ జక్కంశెట్టితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నానికృష్ణ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. "15వ శతాబ్దానికి చెందిన శాసనాల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. కొంత కల్పితం ఉంటుంది. కథ వినగానే చేయగలనా? అని అనుమానం వచ్చింది. 'శ్రీ రామరాజ్యం' చేశాక నమ్మకం కుదిరింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. పీరియాడికల్ సినిమా ఇది'' అని చెప్పారు శ్రీకాంత్.
ఈ చిత్రానికి చక్రి సంగీత దర్శకుడు. "దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కృష్ణదేవరాయను గుర్తుకుతెద్దామనే ఈ సినిమా చేస్తున్నాం. దేవరాయలోని త్యాగం, దానం కలిస్తే ఈ పాత్రవుతుంది. గోదావరి గలగలలకు, విజయనగర వైభవానికి ముడిపెడుతున్నాం'' అని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: పూర్ణ, నృత్యాలు: శివశంకర్, ఫైట్స్: రవివర్మ, కళ: జె.కె., మాటలు: వీరబాబు బాసిన, స్క్రీన్‌ప్లే: రవిరెడ్డి మల్లు, సమర్పణ: నానిగాడి సినిమా, బేనర్: సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా.

No comments: