Saturday, September 10, 2011

న్యూస్: నవదీప్ ఫ్లాప్‌షోకి 'ఆకాశమే హద్దు'

కృష్ణవంశీ డైరెక్షన్‌లో నటించిన 'చందమామ' తర్వాత నవదీప్ హీరోగా ఏ సినిమా హిట్టయ్యింది? ఒక్కటీ లేదు. దాని తర్వాత అతడు హీరోగా నటించిన 'పోరంబోకు', 'ఓం శాంతి', 'యాగం', 'ముగ్గురు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫట్టయ్యాయి. కాకపోతే 'ఆర్య 2'లో చేసిన యాంటీ హీరో కేరక్టర్ కాస్త పేరు తెచ్చింది. తమిళంలోనూ అతడి పరిస్థితి ఆశాజనకంగా లేదు. అతడి తాజా సినిమా 'ఆకాశమే హద్దు' సెప్టెంబర్ 9న రిలీజయ్యింది. ఇందులో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రాజీవ్ మరో హీరోగా నటించాడు. పంచి అనే అమ్మాయి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి రవిచరణ్ మెరిపో డైరెక్టర్. ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్ ఉంది కాబట్టి ఇదేమన్నా ట్రయాంగిల్ లవ్‌స్టోరీయా అనడిగితే అది తెరమీదే చూడాలని డైరెక్టర్ చెబుతున్నాడు. కెరీర్ మొత్తం మీద 'చందమామ' తప్ప మరో సక్సెస్ పొందలేక పోయిన నవదీప్ నటుడిగా మంచి మార్కులు సంపాదిస్తున్నా, మంచి అందగాడైనా పేరుపొందిన డైరెక్టర్లతో హీరోగా పనిచేసే అవకాశాలు అందుకోలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో 'ఆకాశమే హద్దు' పట్ల కూడా ఎవరికీ, ఆఖరికి అతడికి కూడా భ్రమలు లేవు. ఆ సినిమా ఆడితేనే అందరికీ ఆశ్చర్యం.

No comments: