Tuesday, August 24, 2010

Movies: Vandemataram Srinivas failed!


మొదట గాయకుడిగా, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన వందేమాతరం శ్రీనివాస్ నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాడు. నటుడిగా ఆయన ప్రధాన పాత్ర పోషించిన 'అమ్ములు' సినిమాకి పెట్టిన డబ్బంతా బూడిదపాలయ్యింది. ఇప్పుడు డైరెక్టరుగా అయన తొలి ప్రయత్నం 'బద్మాష్' ఫెయిలయ్యింది. ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయించాలని తెలంగాణా వివాదాన్ని వాడుకోవాలని చూసినా లాభం లేకపోయింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో కొంతమంది తెలంగాణ విద్యార్థులు తమ ఆల్బమ్ కోసం పాడమని అడిగారనీ, కానీ సినిమా డైరెక్షనుతో బిజీగా వుండటం వల్ల పాడలేనని చెప్పాననీ, దానికి వాళ్లు బాధపడినట్లున్నారనీ మీడియా వద్ద విచారం వ్యక్తం చేశాడు శ్రీనివాస్. అంటే ఆయన ఉద్దేశంలో అప్పుడు తను పాడనన్నాననే కోపంతో తెలంగాణావాళ్లు 'బద్మాష్'లోని కొన్ని సీన్లని తొలగించమంటున్నారని గొడవ చేస్తున్నారని. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది కాబట్టి, పని ఒత్తిడి లేనందున మరో ఆల్బమ్ కోసం కావాలంటే పాడతానని భరోసా ఇచ్చాడు. 'బద్మాష్' విషయంలో తెలంగాణా వాళ్లు చేసిన గోడవ సంగతేమో కానీ దాన్ని తన సినిమా కలెక్షన్లని పెంచుకోవడానికి అనుకూలంగా మలచుకోవాలని మీడియా ముందు కొద్దిపాటి హంగామా చేశాడు శ్రీనివాస్. కానీ 'బద్మాష్' బాక్సాఫీసు ఫలితంలో ఎలాంటి మార్పూ లేదు. శ్రీనివాస్ ఘోషని ఎవరూ పట్టించుకోలేదు. ఇదివరకు నటనపరంగా విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు డైరెక్షన్ పరంగానూ విమర్శకులకి పని కల్పించాడు. మ్యూజిక్ డైరెక్టరుగానే ఆయన కొనసాగితే బాగుంటుందని విమర్శకుల అభిప్రాయం. కానీ ఆయన వింటాడా?

No comments: