Saturday, August 28, 2010

Movies: Internationally Aishwarya


భారతీయ తారల్లో మరెవరికీ రానంత పేరు అంతర్జాతీయ స్థాయిలో దక్కించుకున్న తార నిస్సందేహంగా ఐశ్వర్యారాయ్. 1994లో మిస్ వరల్డ్ గా నిలిచింది మొదలు ఆమె సాధించిన ఘనతలు..
* ప్రపంచంలో 100 అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా ఐశ్వర్యని టైమ్ మాగజైన్ గుర్తించింది.
* టైమ్ మాగజైన్ ఏషియా ఎడిషన్ కవర్ పేజీ మీద మొదటిసారి కనిపించిన భారతీయ మహిళ ఐశ్వర్య.
* 2004లో లండన్ లోని మేడమ్ టస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో మైనపు ప్రతిరూపాన్ని పొందిన భారతీయుల్లో ఆరవ వ్యక్తి, బాలీవుడ్ తొలి హీరోయిన్.
* అమెరికన్ పాపులర్ టీవీ షోలలో పాల్గొన్న తొలి భారతీయురాలు. 2005లో లేట్ షో విత్ డేవిడ్ లెటర్మాన్ లో, ఓప్రా విన్ ఫ్రే టీవీ షోలో ఒంటరిగా ఒకసారి, 2009లో భర్త అభిషేక్ తో కలిసి మరోసారి పాల్గొంది.
* 2005లో హార్పర్స్ అండ్ క్వీన్ వారి ప్రపంచంలో 10 మంది అత్యంత సౌందర్యరాశుల జాబితాలో ఐశ్వర్యకి స్థానం లభించింది.
* ఐశ్వర్యకి హాలీవుడ్ ప్రెటీ ఉమన్ జూలియా రాబర్ట్స్ ప్రపంచంలోనే అత్యంత సౌందర్యరాశి అని కితాబిచ్చింది.

No comments: