Wednesday, August 25, 2010

Interview: Shriya


"రవితేజ మామాలు యాక్టర్ కాదు. అన్‌బిలీవబుల్ యాక్టర్. ఈ సినిమా తర్వాత ఆయనకి పెద్ద అభిమానినైపోయా'' అని చెప్పారు అందాల తార శ్రియ. ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన 'డాన్ శీను'లో ఆమె రవితేజ సరసన నాయికగా ప్రేక్షకుల్ని అలరించారు. గోపీచంద్ మలినేని డైరెక్టర్‌. ఈ సినిమా సక్సెస్‌ని సాధించిన సందర్భంగా శ్రియ పత్రికలవారితో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

నాలుగేళ్ల తర్వాత ఓ మంచి సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ అయినందుకు ఆనందంగా ఉంది. 'డాన్ శీను' చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. మా అమ్మతో కలిసి ఈ సినిమా చూశా. భాషతో కొంత సమస్య ఉన్నా సినిమా మొదలై పూర్తయ్యేదాకా నవ్వుతూనే ఉన్నా.
ఒకటే నవ్వు
గోపీచంద్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. డైరెక్టర్‌గా తొలి సినిమానే ఇంత బాగా తియ్యడం నమ్మశక్యం కాని సంగతి. సినిమాలో మలుపుల్ని బాగా వర్కవుట్ చేశాడు. అతను స్క్రిప్టు చెప్పేప్పుడే నవ్వుతూ ఉండిపోయా. షూటింగ్ చేసేప్పుడు కూడా ప్రతిరోజూ సెట్స్‌మీద నవ్వుతూనే ఉండేదాన్ని. సినిమాలో అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. నేను ఈ సినిమా చేయడానికి కారణం అదే. నిర్మాతలు చాలా సపోర్టివ్ అంట్ హెల్ప్‌ఫుల్. నన్నో యువరాణిలా చూసుకున్నారు.
రాజా రాజా రవితేజ
రవితేజ మామాలు యాక్టర్ కాదు. అన్‌బిలీవబుల్ యాక్టర్. ఈ సినిమా తర్వాత ఆయనకి పెద్ద అభిమానినైపోయా. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. బ్రహ్మానందంతో చాలా కాలం తర్వాత కలిసి పనిచేయడం హ్యాపీ. అలాగే అలీ, వేణుమాధవ్‌లతో కూడా. అలీ బాల నటుడిగా మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతి సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడం అమేజింగ్. మణిశర్మ మ్యూజిక్ బాగా నచ్చింది. 'రాజా రాజా రవితేజ' పాటంటే మరీ మరీ ఇష్టం.
నా గ్లామర్ రహస్యం
నాది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పాటు కామెడీ మిళితమైన పాత్ర. అందరూ నేను ఇదివరకటికంటే ఇందులో మరింత గ్లామరస్‌గా కనిపించానని అంటున్నారు. నా ఆరోగ్యానికీ, గ్లామరస్‌గా కనిపించడానికీ కారణం నేను క్రమం తప్పకుండా చేసే యోగా, మెడిటేషన్ అనుకుంటా. వాటితో పాటు మేకప్‌మాన్, హెయిర్ స్టయిలిస్ట్, సినిమాటోగ్రాఫర్‌ల పనితనం కూడా తోడయ్యింది.
ప్రతి పాత్రా భిన్నమైనదే
ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమా ఒకదానికొకటి భిన్నమైనదే. చేసిన ప్రతి పాత్రా భిన్నమైనదే. ఎక్కువగా పక్కింటమ్మాయి తరహా పాత్రలు చేశా. వాటితో పోల్చుకుంటే 'డాన్ శీను'లో చేసిన దీపు పాత్ర వైవిధ్యమైంది.
ఐటమ్ సాంగ్స్ చేశా
తెలుగులో ఎందుకు నాకు గ్యాప్ వస్తున్నదో నాకు తెలీదు. మధ్యమధ్యలో ఐటమ్ సాంగ్స్ చేశా. పవన్ కల్యాణ్ 'కొమరం పులి'లోనూ నాదో ఐటమ్ సాంగ్ ఉంది.
తెలుగులో కమిట్ కాలేదు
ప్రస్తుతం తమిళంలో ఆర్యతో 'చికు బుకు' చేస్తున్నా. అలాగే ఓ బాలీవుడ్ సినిమాతో పాటు దీపా మెహతా డైరెక్షన్‌లో ఓ ఇంగ్లీషు సినిమా చేస్తున్నా. తెలుగులో ఇంకా ఏమీ కమిట్ కాలేదు.

No comments: