Friday, August 27, 2010

Movies: 'Katha, Screenplay, Darsakatvam: Appalraju' launched


సునీల్ హీరోగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా శుక్రవారం (ఆగస్టు 27) ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. శ్రేయ ప్రొడక్షన్స్ బానరుపై కిరణ్ కుమార్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిన్నటి తరం అందాల తార శ్రీదేవి క్లాప్ కొట్టగా, సీనియర్ హీరో నాగార్జున కెమెరా స్విచ్చాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు, గుణశేఖర్, శ్రీను వైట్ల వంటి డైరెక్టర్లు, నాగచైతన్య, రానా, సుమంత్ వంటి హీరోలు, ఈ సినిమా హీరో హీరోయిన్లు సునీల్, స్వాతి, అనేకమంది సినిమా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసక్తికరమైన సంగతేమంటే ఈ సినిమా ప్రారంభం సందర్భంగా కలువ కృష్ణసాయి రాసిన ఓ పాటని వినిపించారు. ఆ పాటలో రాంగోపాల్ వర్మ సహా రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, గుణశేఖర్, వినాయక్, శ్రీను వైట్ల వంటి డైరెక్టర్లపై విసుర్లు ఉన్నాయి. అయితే ఆ డైరెక్టర్లు ఆ పాట వచ్చినంతసేపూ బాగా ఎంజాయ్ చేయడం గమనార్హం.

No comments: