Friday, August 20, 2010

Doubts on 'Komaram Puli' release!


పవన్ కల్యాణ్ సినిమా 'కొమరం పులి' ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఇదే హాట్ టాపిక్. అన్నీ కుదిరితే ఆగస్టులోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబరుకి వాయిదా పడిందని అన్నారు. బహుశా పవన్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2కి రిలీజ్ కావచ్చని టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ టైంకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటికి రీరికార్డింగ్ పూర్తయ్యే చాన్స్ లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. రజనీకాంత్ సినిమా 'రోబో' రీరికార్డింగ్ పూర్తయ్యాకే 'కొమరం పులి'కి చేస్తానని ఎ.ఆర్. రెహమాన్ తేల్చిచెప్పాడంటున్నారు. అర్జెంట్ అయితే మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయించుకోమని కూడా రెహమాన్ సలహా ఇచ్చాడంట. ఇంతదాకా వచ్చి మరో మ్యూజిక్ డైరెక్టరుతో పని చేయించుకోవడం ఇష్టంలేని నిర్మాతలు రెహమాన్ కోసం వెయిట్ చేయడానికే డిసైడ్ చేసుకున్నారంట. చూస్తుంటే 'మహేశ్ ఖలేజా'నే ముందుగా రిలీజ్ కాదుగదా!

No comments: