Sunday, August 22, 2010

Movies: Naresh sentiment


సినిమాకో కొత్త హీరోయినుతో నటిస్తున్న అల్లరి నరేశ్ కి మరో కొత్త హీరోయిన్ దొరికింది. ఆమె పేరు రిటూ బరీచా. ఈమె యాడ్స్ భామ. ఫాంటా, ఫా-డియో, ఈబే, ఐసిఐసిఐ యాడ్లతో పాపులరైన మోడల్. 'కత్తి కాంతారావు'లో నరేశ్ కి ఆమె జోడీగా నటిస్తోంది. ఇంతకీ నరేశ్ హిట్లు కొడుతున్నది తన నటనతోనా, లేక హీరోయిన్లతోనా? అనేది చాలామందిలో కలుగుతున్న ప్రశ్న. రీటూని అతను ఎంతగా కమిట్ చేయించాడంటే, ఇప్పుడామె మోడలింగ్ మానేసి తెలుగు సినిమాల్లో సెటిల్ అయిపోవాలనుకుంటోంది. కానీ నరేశ్ తదుపరి సినిమాల్లో నటించకపోవచ్చు. టాప్ హీరోల్లాగే సినిమా సినిమాకీ హీరోయిన్లని మార్చేసే నరేశ్ తను పరిచయం చేస్తున్న కొత్త హీరోయిన్లకి ఆ తర్వాత ఠికానా కూడా కల్పిస్తే బావుంటుందని ఒక ఫిలింనగర్ వాసి వాక్రుచ్చాడు.

No comments: