Thursday, September 16, 2010

సినిమా: సమంతా రాణిస్తుందా?


గౌతమ్ మీనన్ సినిమా 'ఏ మాయ చేశావె'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంతా (పూర్తి పేరు సమంతా రూత్ ప్రభు) టాప్ హీరోయిన్ రేసులో నిలుచుంటుందా? తొలి సినిమాలో నాగ చైతన్య కంటే ఎక్కువ మార్కులు కొట్టేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మొదటగా జూనియర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం'లో కనిపించబోతోంది. ఇందులో ఆమెది తొలి సినిమాకి భిన్నమైన మోడరన్ క్యారెక్టర్. కాజల్ మెయిన్ హీరోయినుగా నటించిన ఈ సినిమాలో సమంతా ఏ మేరకు రాణిస్తుందన్నది ఇప్పుడు చాలామందిని తొలుస్తున్న ప్రశ్న. అక్టోబర్ తొలివారంలో రానున్న ఈ సినిమా ఆమె కెరీరుకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత ఆమె టాప్ హీరో మహేశ్ సరసన 'దూకుడు' సినిమాని చేయబోతోంది. శ్రీను వైట్ల ఈ సినిమాకి డైరెక్టర్. సాధారణంగా అతని సినిమాల్లో హీరోయినుకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందువల్ల మహేశ్ తో ఆమె జోడీ ఆడియన్స్ ని అలరించే అవకాశాలున్నాయి. మరోవైపు తన కంటే అందగత్తె అయిన తాప్సీని ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై కూడా ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది.

No comments: