Friday, September 3, 2010

Movies: Market downfall for Srikanth


ఎన్ని సినిమాలు చేసినా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న నటుడు శ్రీకాంత్. హీరోగా ఉండి వంద సినిమాలు పూర్తి చేసుకున్నా అతని సినిమాలకి మార్కెట్ పెరగకపోగా క్రమేపీ తరుగుతూ వస్తోంది. కృష్ణవంశీ డైరెక్షన్లో ఎంతో గ్రాండుగా అతను నటించిన 100వ చిత్రం 'మహాత్మా' సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశని కలిగించింది. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఆపరేషన్ దుర్యోధన', 'యమగోల.. మళ్లీ మొదలైంది' సినిమాలు కాస్త ఆడేసరికి శ్రీకాంత్ రోజులు మొదలయ్యాయని చాలామంది భావించారు. కానీ ఆ తర్వాత వచ్చిన మైఖెల్ మదన కామరాజ్, నగరం, కౌసల్య సుప్రజ రామ, మహాత్మ సినిమాలు వరుసగా ఫెయిలయ్యాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.
ప్రస్తుతం అతను 'రంగ ది దొంగ', 'సేవకుడు' సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో 'రంగ ది దొంగ' సినిమాకి డైరెక్టర్ జీవీ అలియాస్ జి.వి. సుధాకర్ నాయుడు. విలన్ పాత్రలతో జనానికి పరిచయమైన జీవీ డైరెక్టరుగా మారి తీసిన తొలి సినిమా 'హీరో' (నితిన్ హీరో) ప్రేక్షకుల కళ్లని బైర్లు కమ్మించింది. 'రంగ ది దొంగ' డైరెక్టరుగా అతనికి రెండో సినిమా. తొలి సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని మర్చిపోవాలనే కసితో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విమలా రామన్ హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమాలో అన్ని రకాల మసాలాలు ఉన్నాయి. చూద్దాం.. ఈ సినిమాతోనైనా శ్రీకాంత్, జీవీ సక్సెస్ అవుతారో, లేదో..

No comments: