Monday, September 13, 2010

నేటి పాట: కాదు సుమా కల కాదు సుమా (కీలుగుఱ్ఱం)


చిత్రం: కీలుగుఱ్ఱం (1949)
రచన: తాపీ ధర్మారావు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, వక్కలంక సరళ

పల్లవి:
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలిని తేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా
చరణం 1:
ప్రేమలు పూచే సీమల లోపల
ప్రేమలు పూచే సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తేలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా
చరణం 2:
కన్నె తారకల కలగానముతో
కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ.. ఓ.. ఓహో.. ఓ.. ఓ.. ఒహో..
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా
చరణం 3:
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో ||పూల||
ఆహా.. ఆ.. ఆ.. ఆహా.. ఆ.. ఆ..
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా

No comments: