Wednesday, September 8, 2010

టెలివిజన్: అశ్లీలతని స్లో పాయిజనులా ఎక్కిస్తున్న 'ఆట'


'జీ తెలుగు' చానల్లో ప్రసారమవుతున్న ఓంకార్ 'ఆట'లో పెద్దవాళ్లు మాట్లాడే రెండర్థాల మాటల్ని పిల్లలకు కూడా నూరి పోస్తున్నారు. పిల్లల్ని జడ్జీల స్థానాల్లో కూర్చోపెట్టి, వాళ్ల చేత కూడా ఈ మాటలే చెప్పిస్తున్నారు. చిన్న పిల్లలకి అసభ్యతనీ, అశ్లీలతనీ స్లో పాయిజనులా కొంచెం కొంచెంగా ఎక్కిస్తున్నారు. దీనివల్ల ఈ పిల్లలు పెద్దవాళ్లాయక లైంగిక నేరాలు చెయ్యడం లేదా బాధితులుగా మారే ప్రమాదం వుంది. చైల్డ్ పొర్నోగ్రఫీ విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో మనం పిల్లల్ని మరింత జాగ్రత్తగా పెంచాలి.
డాన్స్ నేర్చుకుంటున్న పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్లపై విపరీతమైన పోటీని రుద్దుతున్నారు. ఎక్కువ సమయం షూటింగ్ లైట్ల మధ్య గడపడం వల్ల వారి చర్మం మీద రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఆహారం, నిద్ర సరిపోక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంత చేసి వీళ్లు సమాజానికి ఇచ్చేది ఎమిటీ అంటే జుగుప్స, అశ్లీలత. ఎదుగుతున్న ఆడపిల్లల్ని డాన్స్ పేరుతో మగాళ్లు ఒకరి చేతుల నుంచి మరొకరు విసిరేస్తుంటే, అది చూసి ఆనందించే తల్లిదండ్రుల్ని ఏమనాలో తెలీడం లేదు.

No comments: