Wednesday, September 8, 2010

మీడియా: అర్థంపర్థంలేని టీఆర్పీల వేట


వార్తను ఒక్కొక్క మీడియా ఒక్కో రకంగా నిర్వచించడం, పాత్రికేయులు మరో రకంగా అంచనాకు రావడం వల్ల జర్నలిజం కాకిగోలగా తయారయ్యింది. ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసేది, ప్రజలకు ప్రయోజనం కలిగించేది, సామాజిక బాధ్యతను గుర్తించేదే వార్త. కాని యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించేది, ప్రకటన కర్తలకు లాభం చేకూర్చేది, ప్రభుత్వాలకు, అధికార పార్టీలకు, అధికారులకు ఆసక్తి కలిగించేది, అర్థబలం, అంగబలం, గ్లామర్ చుట్టూ ప్రదక్షిణ చేసేది వార్త అనే నిర్వచనాన్ని మీడియా నిర్ధారించింది. అందుకే అర్థంపర్థంలేని టీఆర్పీల వేటలో పడి, విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నది.
ఏ పత్రికా, ఏ చానల్ తన పాఠకులెవరో, వీక్షకుల అభిరుచులు ఏమిటో అధ్యయనం చేయించకపోవడం, ప్రొఫైల్ తయారు చేసుకోకపోవడం, మీడియా గాలివాటానికి నిదర్శనం. ఫలితంగా లైవ్ ప్రోగ్రాం జర్నలిస్టులు కోతి చేష్టలకు పాల్పడవలసి వస్తోంది.
ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా మన మీడియా పరిణతి చెందాలంటే ఏం చేయాలో మీడియా సంస్థలే ఆలోచించుకోవాలి. మీడియాలో ఎవరి పెట్టుబడులు ఉన్నాయో పారదర్శకంగా ప్రకటించుకోవాలి.

No comments: