Saturday, October 9, 2010

సినిమా: నెరవేరని శ్రీశ్రీ సంకల్పం

మహాకవి శ్రీ శ్రీ యుగకర్త వీరేశలింగం జీవిత చిత్రాన్ని నిర్మించాలని 1960లో సంకల్పించారు. దానికోసం ఆయన ఉదయశ్రీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని నెలకొల్పారు. 'మహాపురుషుడు కందుకూరి' అనే టైటిలుతో ఆ సినిమా తీయాలనుకున్నారు. కథ, మాటలు, పాటలు సమకూరుస్తూ తనే ఆ సినిమాకి దర్శకత్వం వహించాలని తలపోశారు. అయితే ఎన్నో కారణాల వల్ల ఆయన సంకల్పం నెరవేరలేదు. అంతకుముందు పన్నెండేళ్ల క్రితం ఆయనలాగే డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు కూడా వీరేశలింగం సామాజిక వీర చరితను వెండితెరకి ఎక్కించాలనుకున్నారు. శ్రేయోభిలాషులు వారించారు. రాజమండ్రి నుంచి సరైన సహకారం లభించలేదు. దాంతో ఆయన ఆ ప్రాజెక్టుని విరమించారు. ఇంతవరకు కందుకూరి జీవితం వెండితెర మీద ఆవిష్కృతం కాకుండానే ఉండిపోయింది.

1 comment:

karlapalem Hanumantha Rao said...

శ్రీ శ్రీ గారు ఎన్నో పనులు చేద్దామనుకున్తుండే వారు.అయన కవిత్వం ,వ్యక్తిత్వం ఎంత విలక్షనమయినవో అయన పనులు కూడా అంత విలక్షనంగానే వుండేవి అంటారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్రీ శ్రీ ని గురించి విశాలాంధ్ర వాళ్ళు మంచి పుస్తకాలు తెచ్చారు .వీలయితే చూడండి!