Wednesday, October 20, 2010

నేటి పాట: ఎన్నాళ్లో వేచిన ఉదయం (మంచి మిత్రులు)

చిత్రం: మంచి మిత్రులు (1969)
రచన: సి. నారాయణరెడ్డి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గానం: ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే   ||ఎన్నాళ్లో||
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి                          
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఎస్.పి.: మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
             నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని   ||నీతికి||
             నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
             ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి   ||ఇంకా||
ఘంటసాల: నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
                   కత్తులు విసిరేవానిని, ఆ కత్తితోనె గెలవాలని  ||కత్తులు||
                   నేనెరిగిన చేదునిజం నీతో చెప్పాలని వస్తే
                   ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి    ||ఇంకా||
ఎస్.పి.: ఎన్నాళ్లో వేచిన ఉదయం
             ఈనాడే.. ఎదురౌతుంటే
ఘంటసాల: ఇన్నినాళ్లు దాచిన హృదయం
                   ఎగిసి ఎగిసిపోతుంటే..
ఎస్.పి.: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి
ఘంటసాల: ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి

No comments: