Saturday, October 23, 2010

నేటి పాట: ఒసె వయ్యారి రంగీ (పల్లెటూరి బావ)

చిత్రం: పల్లెటూరి బావ (1973)
రచన: ఆత్రేయ
సంగీతం: టి. చలపతిరావు
గానం: ఘంటసాల

పల్లవి:
ఒసె వయ్యారి రంగీ - వగలమారి బుంగీ
ఊగిందే నీ నడుము ఉయ్యాల
ఆ వూపు చూస్తుంటే -
నే నోపలేకుంటే
పాడిందే నా మనసు జంపాల                
చరణం 1:
నీ చూపులో వుందే పిడిబాకు - దాని
పదునెంతో చూస్తానే -
నీ సెంపలో వుందే సిగురాకు - దాని
వగరెంతో సెబుతానే -
యీయేళ కాదని అనమాకు
ఇంకెన్నాళ్లే యీ కొలువు
నా రవ్వ - నా గువ్వ - నా మువ్వ -
ఓ రంగమ్మా - జివజివలాడిందే
మనసే - గుబగుబలాడిందే...   ||ఒసే||
చరణం 2:
ఎగిరెగిరి పడుతోందే నీ పైట,
    ఓహో యీపాటి చిరుగాలికే
ఉరికురికి వస్తోందే నీ వయసు,
    ఆహ నాతోటి జగడానికే
అదిరదిరి పడుతోంది నీ మనసు,
    వుత్తుత్తి సరసాలకే -
నా కన్న - నా చిన్న - నా పొన్న
ఓ రంగమ్మా - జివజివలాడిందే -
మనసే గుబగుబలాడిందే -   ||ఒసే||
చరణం 2:
కోటప్ప తిరణాల కెళ్లినపుడు -
    మనం కొన్నామె గుళ్లపేరు
అది రొమ్ముమీద అటూ యిటూ వూగుతుంటే
నాకు రిమ్మతెగులు రేగుతుందే -
పెళ్లయినవాణ్ణని జంకమాకు -
ఒకరికి యిద్దరైన వేడుకేలే -
నా చిట్టి - నా పొట్టి - నా పట్టి
ఓ రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
రంగమ్మా ఏస్తానె మూడుముళ్లూ
ప్పిప్పి పిప్పీ డుండుం పిప్పిప్పీ డుండుండుం

No comments: