Saturday, November 6, 2010

నేటి పాట: నీవు లేని నేను లేను (మంచి మనుషులు)

చిత్రం: మంచి మనుషులు (1974)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

అతడు: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు -

ఆమె: నీవు లేని నేను లేను
నేను లేక నీవు లేవు
నేనె నువ్వు - నువ్వే నేనూ
నేనూ నువ్వూ - నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు..

అతడు: తీగల్లో నువ్వూ నేనే అల్లుకొనేది
పువ్వుల్లో నువ్వు నేనె మురిసి విరిసేది
ఆమె: తెమ్మెరలో మనమిద్దరమె పరిమళించేది
తేనెకు మన ముద్దులే తీపిని ఇచ్చేది   ||నీవు లేని||

అతడు: నువ్వులేక వసంతానికి యవ్వన మెక్కడిది
ఆమె: నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిది
అతడు: సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరము
ఆమె: జీవితాన నువ్వూ నేనై కలిశా మీదినము   ||నీవు లేని||

ఆమె: కొండల్లె నువ్వున్నావు నాకు అండగా
అతడు: మంచల్లె నువ్వున్నావు నాకు నిండుగా
ఆమె: ఎన్ని జన్మలైనా ఉందాము తోడు నీడగా
అతడు: నిన్నా నేడు రేపే లేని ప్రేమజంటగా   ||నీవు లేని||

No comments: