Wednesday, November 10, 2010

సినిమా: సహకరించని 'కలెక్టర్‌గారి భార్య'

భూమిక, ప్రకాశ్‌రాజ్ జంటగా నటించిన 'కలెక్టర్‌గారి భార్య' సినిమా నిర్మాత నిలువునా మునిగిపోయాడని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ వర్గాల సమాచారం ప్రకారం ఆ సినిమా తీసేందుకు నిర్మాత, దర్శకుడైన టేకుల కృపాకర్‌రెడ్డికి సుమారు 6 కోట్ల రూపాయల వ్యయమైంది. ఎలాంటి స్టార్ యాక్టర్లు లేకపోయినా అంత ఖర్చవడం ఆశ్చర్యకరం. ఆయన సినిమా నిర్మాణానికి కొత్తవడమే దీనికి కారణం. స్టార్లు లేకపోవడంతో ఆ సినిమాకి సహజంగానే బిజినెస్ కాలేదు. దాంతో సొంతంగా ఆ సినిమాని రిలీజ్ చేశారు. ప్రమోషన్ విషయంలో హీరోయిన్ భూమిక సహకరిస్తుందని ఆశించిన ఆయనకు మిగిలింది నిరాశే. ప్రమోషన్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు భూమిక సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకు అనుగుణంగానే పెట్టిన పెట్టుబడిలో పైసా కూడా జమయ్యే సూచనలు కనిపించని నిర్మాత మళ్లీ సినిమా జోలికి రావడం కష్టంగానే కనిపిస్తోంది.

No comments: