Sunday, November 7, 2010

సమాజం: నక్సలిజం ఎలా పుట్టింది?

నక్సలిజం అనేది భూమి కోసం పుట్టిన ఉద్యమం. 1967లో పశ్చిమ బెంగాలులోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరి ప్రాంతంలో ఈ ఉద్యమం ఆకారం దాల్చింది. అందుకే దీన్ని నక్సల్బరీ ఉద్యమంగా చెప్పుకుంటారు. ఆకలి నుంచి పుట్టిన ఉద్యమం ఇది. కోర్టులో గెలుచుకున్న భూమిని దున్నుకోవడానికి గిరిజనులు ప్రయత్నిస్తుండగా నక్సల్బరీ గ్రామ భూస్వాములు అడ్డుతగిలారు. గిరిజనులపై దాడులు చేయించారు. దీంతో గిరిజనులలో తిరుగుబాటు తలెత్తింది. ఈ పోరాటంలో తొమ్మిదిమంది గిరిజనులు చనిపోయారు. ఈ తిరుగుబాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే నక్సలిజంగా రూపుదాల్చింది. అప్పట్నించీ దేశంలోని పలు ప్రాంతాల్లోకి ఈ ఉద్యమం పాకింది.
ప్రస్తుతానికి మావోయిస్టుల రూపంలో ఉన్న ఈ ఉద్యమంలో 22 వేలమంది సాయుధ నక్సలైట్లు ఉన్నారు. దేశంలోని 630 జిల్లాల్లో 180 నక్సల్ ప్రభావిత జిల్లాలే. గత ఐదారేళ్ల కాలంలో మావోయిస్టు సంబంధిత దాడులు లేదా ఎన్కౌంటర్లలో 2,871 మంది మరణించారు. వీరిలో 982 మంది పోలీసులు. కేంద్ర ప్రభుత్వం 2009లో ఉగ్రవాద సంస్థల జాబితాలో మావోయిస్టు (సీపీఐ-మావోయిస్టు)ను కూడా చేర్చింది. 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

No comments: