Wednesday, November 10, 2010

నేటి పాట: నవ్వులు రువ్వే పువ్వమ్మా (గాజుల కిష్టయ్య)

చిత్రం: గాజుల కిష్టయ్య (1975)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
నవ్వులు రువ్వే పువ్వమ్మా - నీ
నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగునాళ్లూ నీలా
ఉండిపోతే చాలమ్మా

చరణం 1:
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగుతీసిన ముద్దుముఖాన
మొగ్గ సొగసే వుందమ్మా   ||నవ్వులు||

చరణం 2:
ఈ తోటమొత్తము కమ్మినవి - నీ
దోరవయసు అందాలు - ఈ
గాలి మత్తులో వున్నవి - నీ
కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపు సొంపులకు
ఒడిని పడతానుండమ్మా   ||నవ్వులు||

చరణం 3:
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
పాటగానో తేటిగానో
పదినాళ్లున్నా చాలమ్మా   ||నవ్వులు||

No comments: