Saturday, December 26, 2015

Society: Drought and Our Responsibility

కరువు - మన బాధ్యత

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. సందట్లో సడేమియాలా బ్లాక్ మార్కెట్ విశృంఖలమవుతోంది. దీంతో ఆహార పదార్థాల ధరలు కూలీలు, పేదలు కొనలేని స్థితికి పెరిగిపోతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలే వహించాలి. ఈ కరువుకు ఆహుతయ్యేది, గ్రామాల్లో, బస్తీల్లో ఉండే పేదలే. గ్రామీణ పేదలైతే కరువుకు అల్లాడుతూ చేయడానికి పనిలేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. వీళ్ల దిక్కూ మొక్కూ ఆలోచించేవాడే లేడు. ఇలాంటి దారుణ స్థితిలోనూ ప్రభుత్వోద్యోగులు తమ జేబులు నింపుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారే కానీ ఏమాత్రం బాధ్యతను గుర్తించడం లేదు. అందువల్ల ప్రభుత్వం ఏదో చేస్తుందనేది ఒట్టి భ్రమే. పైగా పరిపాలన సాగేది ప్రజా విశ్వాసం కోల్పోయిన ఉద్యోగ వర్గంతోనే. కాబట్టి కరువు సమస్యను ఎక్కువ బాధ్యత తీసుకొని మనమే పరిష్కరించుకోవాలి. మూడు పూటలా సుష్టుగా భోంచేసేవాళ్లు తిండి తగ్గించుకోవాలి. కరువుబారిన పడిన గ్రామాల ప్రజలకు సాయం చేయడానికి నడుం బిగించాలి. లేకపోతే గ్రామాల సాంఘిక జీవితం విచ్ఛిన్నమవడమే కాకుండా దోపిడీలు యథేచ్ఛగా సాగుతాయి.

No comments: